ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Metro Rail: రేపు డ్రైవర్‌ రహిత మెట్రో రైల్‌ ట్రయల్‌ రన్‌

ABN, Publish Date - Oct 25 , 2024 | 11:58 AM

చెన్నై మెట్రో రైల్‌(Chennai Metro Rail) ప్రాజెక్టులో భాగంగా డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్ళను నగరంలో నడుపనున్నారు. ఇందులో భాగంగా, మెట్రో రైల్‌ అధికారులు ఈ నెల 26న తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైల్‌ టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. పూందమల్లిలోని టెస్ట్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌లో ఈ రైళ్ళను పరీక్షిస్తారు. చెన్నై నగరంలో ప్రజా రవాణా సులభతరం చేసే చర్యల్లో భాగంగా మెట్రో రైల్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

చెన్నై: చెన్నై మెట్రో రైల్‌(Chennai Metro Rail) ప్రాజెక్టులో భాగంగా డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్ళను నగరంలో నడుపనున్నారు. ఇందులో భాగంగా, మెట్రో రైల్‌ అధికారులు ఈ నెల 26న తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైల్‌ టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. పూందమల్లిలోని టెస్ట్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌లో ఈ రైళ్ళను పరీక్షిస్తారు. చెన్నై నగరంలో ప్రజా రవాణా సులభతరం చేసే చర్యల్లో భాగంగా మెట్రో రైల్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇపుడు రెండో దశ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Account: ఇకనుంచి రేషన్‌ దుకాణాల్లో ‘ఖాతా’..


రూ.63,246 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును మాధవరం మిల్క్‌ కాలనీ - సిరుచ్చేరి, లైట్‌ హౌస్‌ నుంచి పూందమల్లి, మాధవరం నుంచి షోలింగనల్లూరు(Madhavaram to Sholinganallur) వరకు మూడు మార్గాల్లో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే, పూందమల్లి నుంచి లైట్‌ హౌస్‌ మార్గంలో డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్ళను నడపడంపై అధికారులు దృష్టిసారించారు. ఇందుకోసం మూడు బోగీలతో కూడిన 36 మెట్రో రైళ్ళ తయారీ (మొత్తం బోగీలు 108)ని ఆల్‌స్టోమ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ తయారు చేస్తోంది.


ఇందులోభాగంగా తొలి డ్రైవర్‌ రహిత రైలు తయారు చేసిన ఈ కంపెనీ మెట్రో రైల్‌ అధికారులకు గత నెల 22వ తేదీ అప్పగించింది. ఇదే విషయంపై మెట్రో రైల్‌ అధికారులు మాట్లాడుతూ, వచ్చే యేడాది జనవరి నుంచి దాదాపు మూడు నెలల పాటు పూందమల్లి మెట్రో రైల్‌ డిపోలో 900 మీటర్ల వరకు నిర్మించిన టెస్ట్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌పై ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామన్నారు.


ఆ తర్వాత మరో ఆరు నెలల పాటు పూందమల్లి నుంచి పోరూర్‌ వైపు వెళ్ళే ప్రధాన మార్గంలో కొన్ని కిలోమీటర్ల వరకు ఈ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని తెలిపారు. పూందమల్లి డిపోలో టెస్ట్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌లో ఈ రైళ్ళ బ్రేక్‌ స్థితిగతులు, బ్రేక్‌ పాయింట్‌, ప్రయాణికుల భద్రత తదితర అంశాలను అధ్యయనం చేస్తామని వెల్లడించారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: ఉద్యోగులకు రెండు డీఏలు!

ఈవార్తను కూడా చదవండి: KTR: ఒకటి, రెండేళ్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే

ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలోనే సొంతంగా సీడ్‌ గార్డెన్‌: తుమ్మల

ఈవార్తను కూడా చదవండి: నేడు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 25 , 2024 | 11:59 AM