ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించండి

ABN, Publish Date - Oct 08 , 2024 | 05:43 AM

రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సహకరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర హోం మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సహకరించండి: హోం మంత్రి అనిత

న్యూఢిల్లీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సహకరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర హోం మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం రాష్ట్రానికి 800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించాలని కోరారు. ప్రత్యేక పోలీసు అధికారుల గౌరవ వేతనానికి సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన రూ.25.69 కోట్లను రీయింబర్స్‌ చేయాలని అభ్యర్థించారు.

సోమవారమిక్కడ విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర హోం శాఖ వామపక్ష తీవ్రవాదంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సమావేశ వివరాలను ఆ తర్వాత ఆమె ఒక ప్రకటనలో తెలియజేశారు. ‘విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి వద్ద గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు 526 ఎకరాలను గుర్తించాం. ఆ ప్రాజెక్టుకు క్లియరెన్స్‌పైనా చర్చించాం’ అని వివరించారు.

Updated Date - Oct 08 , 2024 | 05:43 AM