ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister: మంత్రిగారు అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN, Publish Date - Nov 12 , 2024 | 11:00 AM

కూవత్తూరులోని ఓ రిసార్టులో జరిగిన వేలం పాటలో ఎన్నికైన సీఎం తమ నేత స్టాలిన్‌(Stalin) కాదని, ఇలాంటి విమర్శలు చేస్తే ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమని దేవాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌ బాబు(PK Shekhar Babu) అన్నాడీఎంకే అధినేత ఈపీఎ్‌సను పరోక్షంగా హెచ్చరించారు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులు, ఆలయ జీర్ణోద్ధారణ పనులను పరిశీలించారు.

- స్టాలిన్‌... వేలం పాటలో ఎన్నుకున్న సీఎం కాదు

- మంత్రి పీకే శేఖర్‌బాబు ధ్వజం

చెన్నై: కూవత్తూరులోని ఓ రిసార్టులో జరిగిన వేలం పాటలో ఎన్నికైన సీఎం తమ నేత స్టాలిన్‌(Stalin) కాదని, ఇలాంటి విమర్శలు చేస్తే ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమని దేవాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌ బాబు(PK Shekhar Babu) అన్నాడీఎంకే అధినేత ఈపీఎ్‌సను పరోక్షంగా హెచ్చరించారు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులు, ఆలయ జీర్ణోద్ధారణ పనులను పరిశీలించారు.

ఈ వార్తను కూడా చదవండి: ప్రజ్వల్‌ రేవణ్ణ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత


ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెన్నై ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకున్న మేయర్‌ ఎవరైనా ఉన్నారంటే అది ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) మాత్రమేనని గుర్తు చేశారు. వర్షాకాలంలో ఇంట్లో పడుకోవడం లేదన్నారు. చినుకు పడకముందే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, చర్యలు తీసుకునే సీఎం స్టాలిన్‌ మాత్రమేనన్నారు. గతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అంటేనే స్వలాభం కోసం అమలు చేసేవనే పేరుందన్నారు. కానీ, ఇపుడు అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజలకు లబ్ధి చేకూరేవన్నారు.


దాదాపు 56 యేళ్ళుగా ప్రజాసేవకు అంకితమయ్యారని, కఠోర మీసా చట్టాన్ని కూడా ఎదుర్కొన్నారని, ఇప్పటివరకు 18 సార్లు జైలుకు వెళ్ళారని, కానీ, ఒక్కసారి కూడా అవినీతి కేసులో సీఎం స్టాలిన్‌ జైలుకు వెళ్ళలేదని, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం జరిపిన పోరాటాల్లోనే జైలుకు వెళ్ళారన్నారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు నేలపై పాకుతూ వంగి వంగి వెళ్ళిన వ్యక్తి కాదని, 2021లో ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలచే ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ అని అన్నారు. ఇలాంటి విమర్శలు చేస్తే ఎలాంటి చర్చలకైనా తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి పీకే శేఖర్‌బాబు ప్రకటించారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..

ఈవార్తను కూడా చదవండి: IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...

ఈవార్తను కూడా చదవండి: Khammam: బోనకల్‌లో యాచకుడికి ఐపీ నోటీసు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 12 , 2024 | 11:00 AM