ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Satish: 2028లో నేనూ సీఎం రేసులో ఉంటా..

ABN, Publish Date - Jun 30 , 2024 | 12:46 PM

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అంతా సమైక్యంగా ఉన్నామనేలా కనిపించిన కాంగ్రెస్‌ నాయకుల మధ్య ఇటీవల విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఎవరికివారుగా చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి.

- ప్రజాపనులశాఖ మంత్రి సతీశ్‌జార్కిహొళి

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అంతా సమైక్యంగా ఉన్నామనేలా కనిపించిన కాంగ్రెస్‌ నాయకుల మధ్య ఇటీవల విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఎవరికివారుగా చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. తాజాగా శనివారం చిక్కోడిలో ప్రజాపనులశాఖ మంత్రి సతీశ్‌ జార్కిహొళి(Minister Satish Jarkiholi) మీడియాతో సరికొత్త కొత్తబాంబు పేల్చారు. ముఖ్యమంత్రి మార్పు విషయమై స్వామిజీలు కూడా చర్చలకు దిగారని అన్నారు. 2028లో తాను కూడా ముఖ్యమంత్రి పదవి కోసం డిమాండ్‌ చేస్తానని అన్నారు. పరోక్షంగా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్‌(DK Shivakumar)కు పోటీ అనే సందేశం ఇచ్చారు. 2028లో శాసనసభ ఎన్నికల తర్వాత అప్పటి ఫలితాలనుబట్టి తాను ముఖ్యమంత్రి కావాలని కోరతా అన్నారు.

ఇదికూడా చదవండి: CM Stalin: కొడనాడు కేసును ఇంటర్‌పోల్‌ సాయంతో విచారణ జరపాలి


ప్రస్తుతం ముఖ్యమంత్రి మార్పు అనేది ముగిసిన అధ్యాయమన్నారు. నాయకత్వ మార్పు అధిష్టానం తీర్మానిస్తుందని, డీసీఎంల అంశం కూడా అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. ఇటీవల విశ్వ ఒక్కలిగ మహాసంస్థాన మఠం మఠాధిపతి చంద్రశేఖరస్వామిజీ ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్య తప్పుకుని డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. తాజాగా వీరశైవలింగాయత సామాజిక వర్గం నుంచి పంచపీఠం శ్రీశైలమఠాధిపతి జగద్గురు డాక్టర్‌ చిన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్యతోపాటు బాళెహొన్నూరు రంభాపురిమఠం డాక్టర్‌ వీరసోమేశ్వర జగద్గురు లింగాయతలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని లేనిపక్షంలో కనీసం డీసీఎం అయినా ఇవ్వాలన్నారు. ఈ నేపథ్యంలో సతీశ్‌ జార్కిహొళి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 12:46 PM

Advertising
Advertising