ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Minister: రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్‌ కోతలు ఉండవు..

ABN, Publish Date - Mar 28 , 2024 | 01:31 PM

ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్‌ కోతలు ఉండవని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని విద్యుత్‌ శాఖ మంత్రి కేజే జార్ట్‌(Minister KJ Jart) పేర్కొన్నారు.

బెంగళూరు: ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్‌ కోతలు ఉండవని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని విద్యుత్‌ శాఖ మంత్రి కేజే జార్ట్‌(Minister KJ Jart) పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా అధికారులకు ప్రత్యేక సూచనలు చేశామని తెలిపారు. వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరగడం సహజమని, ఈసారి వేసవికి ముందే ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఇందుకు సన్నద్ధమైందని ఆయన పేర్కొన్నారు. లోడ్‌షెడ్డింగ్‌కు తావులేని విధంగా వ్యవహరించాలని విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ గత ఏడాది ప్రతిరోజూ 300 మిలియన్‌ యూనిట్లుగా ఉంటే ప్రస్తుత ఏడాది ఇది 329 మిలియన్‌ యూనిట్లకు చేరిందన్నారు. గత ఏడాది గరిష్టంగా లోడ్‌ 15,300 మెగా వాట్లు కాగా ప్రస్తుత ఏడాది ఇది 17వేల మెగావాట్లకు చేరుకుందన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

వ్యవసాయ పంపుసెట్లకు 7 గంటల విద్యుత్‌ సరఫరా పక్కాగా ఇస్తున్నామన్నారు. విద్యుత్‌ కొరతను అధిగమించే దిశలో థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో గరిష్టంగా ఉత్పత్తి జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని మొత్తం విద్యుత్‌ అవసరాల్లో థర్మల్‌ పవర్‌ స్టేషన్లు కీలక పాత్ర ను పోషిస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో గరిష్టంగా 22 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పాదన జరిగిందని, ప్రస్తుతం ఉత్పాదన గరిష్టంగా రోజుకు 75 మిలియన్‌ యూనిట్లుగా ఉందన్నారు. వర్షాభావ పరిస్ధితి కారణంగా రిజర్వాయర్లలో నీరు సగానికి పైగా తగ్గిపోవడంతో జల విద్యుత్‌ ఉత్పాదన దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి వివరించారు. కాగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాలతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. 370 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యలహంక గ్యాస్‌ ఉత్పాదనా స్థావరం త్వరలోనే పనిచేయడం ప్రారంభించనుందని మంత్రి తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 01:37 PM

Advertising
Advertising