ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి వై-ప్లస్ భద్రత

ABN, Publish Date - Nov 12 , 2024 | 09:16 PM

మిథున్ చక్రవర్తిని పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ షాజాద్ బట్టి సోషల్ మీడియాలో బెదిరించాడు. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు 10 నుంచి 15 రోజుల లోపు క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వీడియో మెసేజ్‌లో షాజాద్ బెదిరించాడు.

కోల్‌కతా: బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)కి వై-ప్లస్ (Y-Plus) భద్రత కేటాయించారు. సోషల్ మీడియాలో బెదిరింపులు రావడంతో ఆయనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) భద్రతను పెంచింది.

Suvendu Adhikari: సువేందు అధికారికి ఇక దేశమంతటా 'జడ్' కేటగిరి భద్రత


విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, మిథున్ చక్రవర్తిని పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ షాజాద్ బట్టి సోషల్ మీడియాలో బెదిరించాడు. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు 10 నుంచి 15 రోజుల లోపు క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వీడియో మెసేజ్‌లో షాజాద్ బెదిరించినట్టు సమాచారం.


మిథున్‌పై రెండు ఎఫ్ఐఆర్‌లు

కోల్‌కతా సమీపంలోని సాల్ట్ లేక్ ఏరియాలో అక్టోబర్ 27న జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మిథున్ చక్రవర్తి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నవంబర్ 6న ఆయనపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా పాల్గొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమబెంగాల్ పీఠం బీజేపీ వశం అవుతుందని, లక్ష్యసాధన కోసం ఏమి చేయడానికైనా సిద్ధమేనని మిథున్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.


జార్ఖాండ్ ప్రచారంలో..

కాగా, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈస్ట్ సింగ్భూమ్ జిల్లాలో మిథున్ గత సోమవారంనాడు రోడ్‌షో నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా ముండా తరఫున ఆయన ప్రచారం సాగించారు. పెద్దఎత్తున జనం ఆయనను చూసేందుకు వచ్చారు. అనంతరం ఘట్‌సిల ప్రాతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని బీజేపీ అభ్యర్థి బాబూలాల్ సోరెన్ తరఫున ప్రచారం చేశారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: కాంగ్రెస్ ఎప్పటికీ ఆ తరగతులను ఎదగనీయదు

Jharkhand: భూములను ఆక్రమిస్తున్న వక్ఫ్ బోర్డుకు ముకుతాడు: అమిత్‌షా

For National news And Telugu Newsఇవి కూడా చదవండి..

Updated Date - Nov 12 , 2024 | 09:16 PM