MLA: ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏడ్చేవారిని ఎవరు నమ్ముతారు..
ABN, Publish Date - Nov 09 , 2024 | 11:05 AM
ఆడవారిలాగా ఏడ్చేవారిని ఎవరు నమ్ముతారని జేడీఎస్ నేత దేవెగౌడ కుటుంబీకులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ(Congress MLA Balakrishna) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నపట్టణ నియోజకవర్గం చక్కెర గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏడ్చేవారిని ఎవరైనా నమ్ముతారా..? అన్నారు.
బెంగళూరు: ఆడవారిలాగా ఏడ్చేవారిని ఎవరు నమ్ముతారని జేడీఎస్ నేత దేవెగౌడ కుటుంబీకులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ(Congress MLA Balakrishna) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నపట్టణ నియోజకవర్గం చక్కెర గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏడ్చేవారిని ఎవరైనా నమ్ముతారా..? అన్నారు. ఆడవారిలాగా ఏడుస్తారని, ఏడ్చేవారిని లీడర్‌లు అంటారా..? అన్నారు. అభ్యర్థి సీపీ యోగేశ్వర్‌కు సినిమాలలో కళ్లకు ఏదో పెట్టుకుని ఏడుస్తారు కదా... అలా నీవు ప్రయత్నించు అని సూచించానని అందుకు యోగేశ్వర్ తనకు అటువంటి ఏడుపులు రావని చెప్పారన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. సీఎం జైలుకెళ్లడం ఖాయం..
ప్రతి ఎన్నికల్లోనూ వారు ఏడ్చారని ప్రస్తుతం అభ్యర్థి నిఖిల్ అదే వరుసలో ముందుకు పోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశామని, మేం పురుషులను నమ్ముకోలేదని నోరు జారారు. మేం తల్లులను, ఆడబిడ్డలను నమ్ముకున్నామన్నారు. అంతలోనే సర్దుకుని పురుషులంటే మాకెటువంటి ద్వేషం లేదని, మీరు అసంతృప్తికి లోను కారాదని, మీరు ఓట్లు వేయకపోతే మాకు కష్టమే అన్నారు. అయితే మాకు ఆడబిడ్డల ఆశీర్వాదం ఎక్కువని సర్దిచెప్పారు.
మండిపడ్డ దేవెగౌడ
ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై జేడీఎస్ నేత దేవెగౌడ తీవ్రంగా స్పందించారు. కొత్వాల్ శిష్యులకు ఎప్పుడైనా కన్నీరు వస్తుందా..? అంటూ మండిపడ్డారు. డీసీఎం డీకే శివకుమార్‌ను ఉద్దేశించి దేవెగౌడ వ్యాఖ్యానించారు. ఇదే విషయమై గురువారం చన్నపట్టణ ప్రచారసభలో సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ దేవెగౌడ మనవడు నిఖిల్‌కు ఏడ్చేది నేర్పించారని, అందుకే ప్రతిసభలోనూ నిఖిల్ ఏడుస్తుంటారని అన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మెడికల్ రీయింబర్స్‌మెంట్.. ఆన్‌లైన్‌లోనే!
ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: బెంగళూరులో ముగిసిన ‘హైడ్రా’ పర్యటన
ఈవార్తను కూడా చదవండి: jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే కుక్కచావే
Read Latest Telangana News and National News
Updated Date - Nov 09 , 2024 | 11:05 AM