ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kolkata: ప్రతిపక్షాలన్నింటినీ జైల్లో వేయడం మోదీ గ్యారంటీ.. దీదీ ఘాటు విమర్శలు

ABN, Publish Date - Apr 08 , 2024 | 05:33 PM

ప్రధాని మోదీ(PM Modi) చెబుతున్న "మోదీ కా గ్యారంటీ" అంటే ప్రతిపక్ష నేతలను జైల్లో వేయడమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఘాటు విమర్శలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె జలపాయిగురిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు.

కోల్‌కతా: ప్రధాని మోదీ(PM Modi) చెబుతున్న "మోదీ కా గ్యారంటీ" అంటే ప్రతిపక్ష నేతలను జైల్లో వేయడమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఘాటు విమర్శలు చేశారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె జలపాయిగురిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. సార్వత్రిక ఫలితాలు వెలువడే జూన్ 4లోపే ప్రతిపక్షాలన్నింటినీ బీజేపీ జైల్లో వేయిస్తుందని అన్నారు.

Vi: ఐడియా నుంచి అదిరిపోయే ప్లాన్.. రూ.901తో రీచార్జ్ చేసుకోండి.. ఈ బెనిఫిట్స్ పొందండి


"మోదీ గ్యారెంటీ ఏంటి? జూన్ తర్వాత అందరినీ జైల్లో పెడతారా. ఇదేనా ప్రధాని భాష? జూన్‌లో ఎన్నికలు ముగిశాక ప్రతిపక్షాలను ఎందుకు అరెస్టు చేస్తారు. హిందుస్థాన్‌ని జైలులా మార్చేశారు. ఓ జేబులో ఎన్ఐఏ, మరో జేబులో ఉన్న సీబీఐ, ఈడీ, ఐటీవంటి దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పుతున్నారు. ఐటీ, ఈడీ సంస్థలు బీజేపీకి నిధులు సేకరించే వ్యవస్థలు. బీజేపీ రాజకీయ లక్ష్యాల కోసం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోంది. టీఎంసీ కార్యకర్తలను జైల్లో ఉంచారు. ఎన్నికల తరువాత బీజేపీ నేతలను జైల్లో పెడతామని చెబితే ఎలా ఉంటుంది. కానీ అలా మాట్లాడటం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు" అని దీదీ కామెంట్స్ చేశారు.

బెంగాల్‌లో 2019 ఎన్నికల్లో 42 లోక్‌సభ స్థానాలకుగానూ 18 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. తృణమూల్ 22 స్థానాల్లో గెలుపొందింది. అయితే 2021 రాష్ట్ర ఎన్నికలలో తృణమూల్ ఘన విజయం సాధించింది. ఈ మధ్య కాలంలో బెంగాల్ లో సంచలనం సృష్టించిన సందేశ్‌ఖాలీ వివాదం టీఎంసీని ఇరుకున పెట్టింది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది. దీంతోపాటు టీఎంసీ సుదీర్ఘ కాలం అధికారంలో ఉండటంతో సాధారణంగా ప్రజా వ్యతిరేకత ఉంటుందని.. అది తమకు అనుకూలిస్తుందని భావిస్తోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 08 , 2024 | 05:33 PM

Advertising
Advertising