ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crime News: మోస్ట్‌ వాంటెండ్‌ సీరియల్‌ కిల్లర్‌ అరెస్ట్‌.. 35 ట్రైన్లలో..

ABN, Publish Date - Nov 27 , 2024 | 05:58 PM

మోస్ట్‌ వాంటెండ్‌ సీరియల్‌ రైల్వే కిల్లర్‌ కరమ్ విర్ అరెస్ట్‌ అయ్యాడు. పీటీ వారెంట్‌పై నిందితుడిని సికింద్రాబాద్ జిఆర్పి పోలీసులు హైదరాబాద్‌ తీసుకొచ్చారు.

సీరియల్‌ రైల్వే కిల్లర్‌ అరెస్ట్: రైల్వే స్టేషన్లే అతడి స్థావరాలు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు.. దోచుకోవడం.. హత మార్చడం అతడి నైజం. ఐదు రాష్ట్రాల్లో హత్యలకు పాల్పడి, గడగడ లాడిస్తున్న సీరియల్ కిల్లర్ కరమ్ విర్ ను గుజరాత్ లోని వల్సాద్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా 35 ట్రైన్లలో హత్యలు, దోపీడీలు చేసిన కరమ్ వీర్‌ను గుజరాత్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొనగా పీటీ వారెంట్‌పై నిందితుడిని సికింద్రాబాద్ జిఆర్పి పోలీసులు హైదరాబాద్‌ తీసుకోచ్చారు.


మహిళలే టార్గెట్..

35 రోజుల్లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లల్లో తిరుగుతూ.. ఏకంగా ఐదు రాష్ట్రాల్లో ఐదు హత్యలు చేశాడు. ట్రైన్‌లో దివ్యాంగుల బోగీల్లోకి చొరబడి దోపిడీలు, హత్యలు, అత్యాచారలు చేయడం అలవాటు పడ్డాడు. వల్సాద్‌ ఎస్పీ డాక్టర్‌ కరణ్‌రాజ్‌ సింగ్‌ వాఘేలాను నిందితుడి కరమ్ విర్ యొక్క వివరాలను తెలిపాడు. ఒకచోట దోపిడీకి పాల్పడి హత్య చేస్తే మరో చోటికి కరమ్ వీర్‌ తన స్థావరం మార్చడం అలవాటుగా మార్చుకున్నాడని తెలిపారు. రైల్వేస్టేషన్ల వద్ద ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ దోపిడి చేసి హత్యలకు పాల్పడినట్లు ఎస్పీ కరణ రాజ్ వాఘేలా తెలిపారు.

సీరియల్ కిల్లర్ కరమ్ వీర్‌ జాట్‌ హర్యానాకు చెందిన వ్యక్తి అని తెలిపారు. గతంలో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలో అనేక నేరాలకు పాల్పడ్డాడని వెల్లడించారు. రైల్వేలో సీరియల్‌ కిల్లర్‌గా మారిపోయి వరుసగా హత్యలు చేస్తున్నాడని తెలిపారు. ఇటీవల సికింద్రాబాద్‌లోని ఓ రైలులోని వికలాంగుల పెట్టెలో ఓ మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. దీంతో సికింద్రాబాద్‌ జీఆర్పీ అధికారులకు వల్సాద్‌ పోలీసులు సమాచారం అందజేయగా.. ఈ హత్య తానే చేసినట్లు నిందితుడు కరమ్‌ వీర్‌ ఒప్పుకున్నాడు. దీంతో నగర పోలీసులు పీటీ వారెంట్‌పై కరమ్‌ వీర్‌ను హైదరాబాద్‌కి తీసుకోచ్చారు.

Updated Date - Nov 27 , 2024 | 06:01 PM