Chennai: అయ్యో పాపం.. అతిగా స్పందించిన నెటిజన్లు.. మహిళ ఆత్మహత్య..
ABN, Publish Date - May 20 , 2024 | 03:26 PM
ఏదైనా ఘటనపై సోషల్ మీడియాలో స్పందించడం ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది. అసలు విషయం తెలుసుకోకుండా అతిగా స్పందించడం అనార్థాలకు దారితీస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనం తమిళనాడులోని కొయ్యంబత్తూరులో జరిగిన ఘటన. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టడంతో పాటు.. తన చిన్నారిపై తల్లికి ప్రేమ లేదనేవిధంగా కామెంట్స్ పెట్టి.. ట్రోల్ చేయడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏదైనా ఘటనపై సోషల్ మీడియాలో స్పందించడం ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది. అసలు విషయం తెలుసుకోకుండా అతిగా స్పందించడం అనార్థాలకు దారితీస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనం తమిళనాడులోని కొయ్యంబత్తూరులో జరిగిన ఘటన. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టడంతో పాటు.. తన చిన్నారిపై తల్లికి ప్రేమ లేదనేవిధంగా కామెంట్స్ పెట్టి.. ట్రోల్ చేయడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గత నెలలో చెన్నైలోని ఓ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి అనుకోకుండా తల్లిం చంకలోని పాప జారి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ మీదున్న రేకులపై పడింది. రేకులపై నుంచి నెమ్మదిగా కిందకి జారిపోతుండగా.. చిన్నారిని కాపాడేందుకు అపార్ట్‌మెంట్ వాసులు తీవ్రంగా ప్రయత్నించారు. చిన్నారి కిందపడితే ఎటువంటి గాయాలు కాకుండా ఉండేందుకు కింద బెడ్‌షీట్‌లు పర్చడంతో పాటు చిన్నారిని పట్టుకునేందుకు స్థానికులంతా వరుసగా నిల్చున్నారు. అలాగే మొదటి అంతస్తు బాల్కనీలోకి వెళ్లి పాపను సురక్షితంగా కిందకి దించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఓ వ్యక్తి చిన్నారిని పట్టుకుని సురక్షితంగా కిందకు దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాపను రక్షించిన వ్యక్తిని చుట్టుపక్కలవారంతా అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పాప విషయంలో తల్లి రమ్య నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. వాస్తవానికి ఆ పాప అంటే తల్లి రమ్యకు ఎంతో ప్రేమ. చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ దురదృష్టావశాత్తు చిన్నారి జారిపోడిపోయిందని ఇది అనుకోకుండా జరిగిన సంఘటన తప్పితే తల్లి నిర్లక్ష్యంతో జరిగినది కాదని అపార్ట్‌మెంట్ వాసులతో పాటు చుట్టుపక్కలవారు స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ట్రోలర్స్ మాత్రం రెచ్చిపోయారు. పాప సురక్షితంగా బయటపడిందని సంతోష పడకుండా.. చిన్నారి తల్లి మరింత బాధపడేలా సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ తట్టుకోలేక రమ్య తీవ్ర మనోవేదనకు గురై చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం కొయ్యంబత్తూరులోని తన పుట్టింట్లో అపాస్మారక స్థితిలో పడిఉన్న రమ్యను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Lok Sabha Elections 2024 : కాంగ్రెస్‌లో మమత చిచ్చు!
ట్రోలింగ్స్‌తో
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైంది. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా కారణంగా మంచి జరుగుతున్నా.. చెడు ఘటనలు అనేకం జరుగుతున్నాయి. అసలు వాస్తవం తెలుసుకోకుండా ప్రతి ఒక్కరూ ఎక్కువుగా స్పందించడంతో అవతలి వ్యక్తులు బాధపడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ట్రోలింగ్స్ కారణంగా ఎంతోమంది వ్యక్తులు మనస్థాపానికి గురై తమ ప్రాణాలు తామే తీసుకుంటున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసి ట్రోల్స్ చేయడం కొందరికి అలవాటుగా మారింది. ఇలాంటి ఘటనలతోనైనా ట్రోలింగ్ చేసేవాళ్లు తమ బుద్ధిని మార్చుకుని.. ఏ విషయంలో ఎంతవరకు స్పందించాలో అంతకు మాత్రమే పరిమితమైతే మంచిదని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరి మనస్థత్వం ఒకే విధంగా ఉండదని.. అందుకే ఏదైనా ట్రోల్స్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని, మనకు సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్ కాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
National : 8 రాష్ట్రాలు.. 49 స్థానాలు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest National News and Telugu News
Updated Date - May 20 , 2024 | 05:23 PM