ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP High Court : ఆరెస్సెలో ఉద్యోగులు చేరకుండా నిషేధించడం తప్పే

ABN, Publish Date - Jul 27 , 2024 | 03:31 AM

అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతలు పొందిన ఆరెస్సె్‌సలాంటి సంస్థలను నిషేధ సంస్థల జాబితాలో పెట్టడం తప్పిదమని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వానికి యాభై ఏళ్లు పట్టిందని మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది.

  • మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్య

ఇండోర్‌, జూలై 26: అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతలు పొందిన ఆరెస్సె్‌సలాంటి సంస్థలను నిషేధ సంస్థల జాబితాలో పెట్టడం తప్పిదమని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వానికి యాభై ఏళ్లు పట్టిందని మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగులు చేరకూడని సంస్థల జాబితాలో ఆరెస్సెస్‌ పేరును తప్పుగా పొందుపరిచిందని తెలిపింది.

ఆరెస్సెస్‌ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడాన్ని నిషేధిస్తున్న సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ కాండక్ట్‌ రూల్స్‌-1964, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పలు ఆఫీస్‌ మెమొరాండంలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

రిటైర్డ్‌ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పురుషోత్తం గుప్తా దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై తీర్పు వెలువరించింది. ఆరెస్సె్‌సలో ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న నిషేఽధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఈ నెల 9న జారీచేసిన మెమోను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రముఖంగా ప్రచురించాలని కేంద్ర హోంశాఖ, సిబ్బంది-శిక్షణ శాఖలను ఆదేశించింది.

ఉగ్ర కలకలం.. జమ్మూలో హైఅలెర్ట్‌

న్యూఢిల్లీ, జూలై 26 : జమ్మూ ప్రాంతంలో భారత సైన్యం హైఅలెర్ట్‌ ప్రకటించింది. పంజాబ్‌, పఠాన్‌కోట్‌ జిల్లాలోని ఫంగోత్లీ గ్రామంలో ఏడుగురు గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం సంచరించారు. దీనిపై అక్కడి ప్రజలు అధికారులకు సమాచారం ఇచ్చారు.

దీంతో అప్రమత్తమైన పంజాబ్‌ పోలీసులు, ఆర్మీ.. పఠాన్‌కోట్‌ పరిసర ప్రాంతాల్లో భారీ గాలింపు ఆపరేషన్‌ చేపట్టాయి. అలాగే, జమ్మూ ప్రాంతంలో భద్రతను పెంచారు.

ఉగ్రదాడి ముప్పు నేపథ్యంలో ఆర్మీ స్థావరాలు, కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జమ్మూలోని బడులకు శనివారం వరకు సెలవులు ప్రకటించారు.

Updated Date - Jul 27 , 2024 | 03:31 AM

Advertising
Advertising
<