ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MP Kanimozhi: ఎంపీ కనిమొళి సంచలన కామెంట్స్.. వారంతా అడ్రస్‌ లేకుండా పోయారు..

ABN, Publish Date - Feb 29 , 2024 | 11:53 AM

డీఎంకే నాశనాన్ని కోరుకున్నవారంతా పత్తాలేకుండా పోయారని ఆ పార్టీ ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ప్రధాని మోదీకి కౌంటర్‌ ఇచ్చారు. తిరునెల్వేలి బహిరంగసభలో మోదీ ప్రసంగిస్తూ డీఎంకే అడ్రస్‌ లేకుండా పొతుందని చేసిన విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు.

- మోదీకి కనిమొళి కౌంటర్‌

చెన్నై: డీఎంకే నాశనాన్ని కోరుకున్నవారంతా పత్తాలేకుండా పోయారని ఆ పార్టీ ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ప్రధాని మోదీకి కౌంటర్‌ ఇచ్చారు. తిరునెల్వేలి బహిరంగసభలో మోదీ ప్రసంగిస్తూ డీఎంకే అడ్రస్‌ లేకుండా పొతుందని చేసిన విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు. తూత్తుకుడిలో ప్రధాని పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొని విమానంలో చెన్నైకి చేరుకున్న కనిమొళి విమానాశ్రయం వద్ద విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటం వల్లే రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో ప్రధాని మోదీ అదేపనిగా పథకాలను ప్రకటిస్తున్నారని విమర్శించారు. గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేసిన ప్రతిపాదనలు గురించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కేంద్రం అమలు చేసే మంచి పథకాలను డీఎంకే ప్రభుత్వం ఎన్నడూ వ్యతిరేకించదన్నారు. ప్రధాని ఆవాస్‌ యోజన పథకం కింద ఇళ్లు నిర్మించేందుకు కేంద్రం పావు శాతం నిధులు మాత్రమే కేటాయిస్తుందని, ముప్పావు శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయ చరిత్రను పరిశీలిస్తే డీఎంకే నాశనమవుతుందని చెప్పినవారంతా పత్తా లేకుండా పోయారని కనిమొళి అన్నారు. కులశేఖరపట్టినం రాకెట్‌ ప్రయోగ కేంద్రం కోసం స్థలమిచ్చింది రాష్ట్ర ప్రభుత్వమేనని, అక్కడ రాకెట్‌ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలని యేళ్లతరబడి డిమాండ్‌ చేసింది డీఎంకే నాయకులేనని పేర్కొన్నారు. తూత్తుకుడి హార్బర్‌లో జరిగిన సభలో తాను, రాష్ట్రమంత్రి ఈవీ వేలు పాల్గొన్న మోదీ తన ప్రసంగంలో తమ ఇరువురి పేర్లను ప్రస్తావించనే లేదని వాపోయారు. రాకెట్‌ ప్రయోగ కేంద్రం ద్వారా రాష్ట్రం కీర్తి పెరుగుతుందనే భావనతోనే ఆ సభలో తాను పాల్గొన్నానని చెప్పారు. రాజకీయాలు, వేరు, మతాలు వేరు అనే భావన కలిగినవారే తమిళ ప్రజలని ఆమె చెప్పారు. హరించుకుపోతున్న రాష్ట్ర ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడే పార్టీ డీఎంకే మాత్రమేనని ఆమె తెలిపారు.

స్టాలిన్‌పై భయంతోనే మోదీ పర్యటన

- ఆర్‌ఎస్‌ భారతి

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై ఉన్న భయంతోనే ప్రధాని నరేంద్రమోదీ తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి విమర్శించారు. పెరుగుతున్న స్టాలిన్‌ కీర్తిని చెడగొడితే ఇండియా కూటమిని బలహీనపరచ వచ్చునని భావించే మోదీ వారానికొకమారు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని యెద్దేవా చేశారు. దివంగత నేతలు అన్నాదురై, కరుణానిధి బాటలో ద్రావిడ తరహా సుపరిపాలనను అందిస్తున్న డీఎంకే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధిస్తుందని, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ కనిపించకుండా పోతుందని చెప్పారు.

Updated Date - Feb 29 , 2024 | 11:53 AM

Advertising
Advertising