MUDA Case: రాజకీయ కుట్రల బాధితురాలు నా భార్య: సిద్ధరామయ్య
ABN, Publish Date - Oct 01 , 2024 | 04:39 PM
తన భూములను ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్టు తన భార్య ప్రకటించడం, లేఖ రాయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, అయినప్పటికీ ఆమె నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు
బెంగళూరు: రాజకీయలతో ఏమాత్రం సంబంధం లేని తన భార్య పార్వతి రాజకీయ విద్వేషాలు, కుట్రల భాదితురాలని, తీవ్ర మనోవేదనకు గురైందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. తన భూములను ముడా సంస్థకు ఇచ్చే్స్తున్నట్టు ఆమె ప్రకటించడం, లేఖ రాయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, అయినప్పటికీ ఆమె నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని సామాజిక మాధ్యమం 'ఎక్స్' సీఎం తెలిపారు.
పసుపు కుంకుమలుగా తన సోదరుడు ఇచ్చిన ప్లాట్లపై ఇంత రాద్ధాంత తగదని, ఎలాంటి అవినీతి మచ్చలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 'ముడా'కు చెందిన 14 ప్లాట్లను తిరిగి ఇచ్చేస్తున్నట్టు సిద్ధరామయ్య భార్య సోమవారం ఒక లేఖ విడుదల చేశారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ, తన భార్యకు ఆమె సోదరుడు గిఫ్ట్‌గా ఇచ్చిన భూమిని 'ముడా' ఆక్రమించుకోవడంతో ప్రత్యామ్నాయ స్థలాన్ని ఆమె కోరిందని చెప్పారు. విజయనగరలో ప్రత్యామ్నాయం స్థలం ఇమ్మని ఆమె కోరలేదని, అయితే అక్కడే ఆమెకు స్థలం కేటాయించారని చెప్పారు. ఈ విషయాన్ని రాజకీయం చేశారని, బీజేపీ-జేడీఎస్ ఎలాంటి రాజకీయాలు చేసినా తాము ఎదుర్కొంటామని చెప్పారు. ఎలాంటి మచ్చలేని తన భర్త రాజకీయ జీవితాన్ని వివాదంలోకి లాగడం చూసే ఆమె భూములను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించినా ఆమె నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని తెలిపారు.
Haryana Assembly Elections: మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి
యడియూరప్ప కేసుకు, తన కేసుకు పొంతన లేదని కూడా సిద్ధరామయ్య తెలిపారు. డీనోటిఫికేషన్ ఆప్ ల్యాండ్ కేసు ఆయనపై ఉందని, తనకు అలాంటిదేమీ లేదని అన్నారు. సెల్ఫ్ విట్నెస్‌గా తాను రాజీనామా చేయాల్సిన పని లేదనన్నారు. ఈడీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు... లీగల్‌గా పోరాటం సాగిస్తానని చెప్పారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుతం..
Updated Date - Oct 01 , 2024 | 04:39 PM