MUDA Scam: సీఎంపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్తకు ఈడీ సమన్లు
ABN, Publish Date - Oct 02 , 2024 | 08:16 PM
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై సెప్టెంబర్ 31న పోలీస్ ఎఫ్ఐఆర్‌తో సమానమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)ను ఈడీ నమోదు చేసింది. తన భార్యకు 14 స్థలాలను 'ముడా' కేటాయించడంలో అవకతవకలు జరిగాయన్న అరోపణలను సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు.
బెంగళూరు: మైసూర్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వేగం పెంచింది. ఈ కేసుకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)పై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ (Snehamayi Krishna)కు ఈడీ బుధవాంనాడు సమన్లు జారీ చేసింది. స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు అక్టోబర్ 3వ తేదీ ఉదయం 11 గంటలకు తమ కార్యాలయానికి రావాలని అందులో పేర్కొంది.
Jan Suraaj Party: జన్ సురాజ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మనోజ్ భారతి
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై సెప్టెంబర్ 31న పోలీస్ ఎఫ్ఐఆర్‌తో సమానమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)ను ఈడీ నమోదు చేసింది. తన భార్యకు 14 స్థలాలను 'ముడా' కేటాయించడంలో అవకతవకలు జరిగాయన్న అరోపణలను సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు. లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దేవరాజ్ నుంచే భూములను మల్లికార్జున స్వామి కొనుగోలు చేసి పార్వతికి గిఫ్ట్‌గా ఇచ్చారని ఆరోపణలున్నాయి. దీనికి ముందు, సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని ప్రత్యేక కోర్టు సమర్ధించింది. కాగా, తనకు సోదరుడు గిఫ్ట్‌గా ఇచ్చిన భూముల విషయాన్ని రాజకీయం చేసి తన భర్తను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని సిద్ధరామయ్య భార్య ఆవేదనకు గురయ్యారు. 14 స్థలాలను తిరిగి ముడాకు ఇచ్చివేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ, రాజకీయాలతో సంబంధం లేని తన భార్య తీవ్ర మానసిక సంక్షోభానికి గురయ్యారని, భూములను తిరిగి ఇచ్చివేయాలని ఆమె నిర్ణయించడం తనకు ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని అన్నారు. ఈడీతో సహా ఎవరినైనా సరే తాను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
Haryana Polls: హరియాణా బీజేపీ.. ముచ్చటగా మూడోసారికి, ఆ మూడే కీలకం
Varanasi: ఆలయాల వద్ద ఉద్రిక్తత.. సాయిబాబా విగ్రహాల తొలగింపు
Updated Date - Oct 02 , 2024 | 08:16 PM