Share News

BMW hit-and-run case: మిహిర్ షా అరెస్ట్..

ABN , Publish Date - Jul 09 , 2024 | 05:12 PM

ముంబైలోని వర్లీలో మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును అతివేగంగా నడిపి మహిళ మృతికి కారణమైన మిహిర్ షాను ముంబై పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

BMW hit-and-run case: మిహిర్ షా అరెస్ట్..

ముంబై, జులై 09: ముంబైలోని వర్లీలో మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును అతివేగంగా నడిపి మహిళ మృతికి కారణమైన మిహిర్ షా (24)ను ముంబై పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మంగళవారం ముంబై సమీపంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం.. మిహిర్ షా మద్యం మత్తులో తన కారును అతి వేగంగా నడిపాడు.

ఆ క్రమంలో అదే రహదారిపై వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న దంపతులు కావేరీ నక్వా, ప్రదీప్ కింద పడిపోయారు. కావేరి నక్వా మీద నుంచి కారు వేగంగా వెళ్లడమే కాకుండా.. దాదాపు 1.5 కిలోమీటర్ల మేర ఆమెను ఈడ్చుకు వెళ్లింది. దీంతో కావేరి అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త ప్రదీప్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: Indian student: న్యూయార్క్‌లో అవినాష్ గద్దె దుర్మరణం


ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో.. కారును మిహిర్ షా నడుపుతున్నాడు. కారు డ్రైవర్ రాజర్షి బిదావత్ మాత్రం అతడి పక్కన కూర్చున్నాడు. అయితే ఈ ప్రమాదం జరిగిన అనంతరం మిహిర్ షా.. తన తండ్రి, శివసేన నాయకుడు రాజేశ్ షాకి ఫోన్ చేసి.. ప్రమాదాన్ని వివరించాడు. దాంతో రాజేశ్ షా.. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాద ఘటన స్థలం నుంచి వెళ్లిపోవాలని తన కుమారుడికి సూచించారు. అలా అదృశ్యమైన మిహిర్ షా.. మంగళవారం ముంబైలోని క్రైమ బ్రాంచ్ పోలీసులకు చిక్కాడు.

ఇక ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా మిహిర్ షాను గాలించడం కోసం 11 క్రైమ్ బ్రాంచ్ బృందాలను ముంబై పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు రాజేశ్ షాతోపాటు కారు డ్రైవర్ రాజర్షి బిదావత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌తోపాటు ఒక రోజు పోలీస్ కస్టడీ విధించారు.

Also Read: SIT's Report: హాత్రాస్‌ తొక్కిసలాటలో ‘కుట్ర కోణం’..!


అయితే రాజేశ్ షా సోమవారం కోర్టు ద్వారా బెయిల్ అందుకున్నారు. ఇక మిహిర్ షా తండ్రి రాజేశ్ షా.. మహారాష్ట్రలోని అధికార శిండే వర్గానికి చెందిన కీలక నేత. దీంతో ఈ కేసు నుంచి తన కుమారుడిని బయట పడవేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారని సమాచారం. అంతేకాదు.. మిహిర్ షాను విదేశాలకు పంపేందుకు చర్యలు చేపట్టినట్లు వార్తలు సైతం గుప్పుమన్నాయి.

Also Read: Congress Party: నెల రోజుల పాలనపై ఫైర్.. మోదీ‌కి సంధించిన ‘10 అంశాలు’

దాంతో అతడిపై లూక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన అన్నీ సీసీ ఫుటేజ్‌లను కోర్టుకు పోలీసులు ఇప్పటికే సమర్పించారు. దీంతో ఈ కేసు నుంచి మిహిర్ షా తప్పించుకోలేని విధంగా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 09 , 2024 | 05:13 PM