Yogi Adityanath: ముంబై పోలీసులకు బెదిరింపు.. అరెస్ట్

ABN, Publish Date - Nov 03 , 2024 | 11:33 AM

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్ష్యంగా బెదిరింపు సందేశం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. యోగికి మరింత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబై పోలీసులకు నిన్న సాయంత్రం మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే లక్నో పోలీసులను అప్రమత్తం చేశారు. కాల్ చేసింది ఎవరు..? ఎక్కడి నుంచి ఫోన్ చేశారని ఆరా తీస్తున్నారు.

Yogi Adityanath: ముంబై పోలీసులకు బెదిరింపు.. అరెస్ట్
Uttat Pradesh CM Yogi Adityanath

ముంబై: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు శృతి మించాయి. గత నెలలో ఎన్సీపీ (శరద్ పవార్) నేత బాబా సిద్ధిఖీని హతమార్చిన సంగతి తెలిసిందే. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌‌ను టార్గెట్ చేశారు. యోగిని హతమారుస్తామని ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు శనివారం సాయంత్రం బెదిరింపు మెసేజ్ ఇచ్చారు. యోగి ఆదిత్యనాథ్ పది రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించారు.


Section 30 Police Act.jpg


పోలీసులు అలర్ట్

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్ష్యంగా బెదిరింపు సందేశం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. యోగికి మరింత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబై పోలీసులకు నిన్న సాయంత్రం మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే లక్నో పోలీసులను అప్రమత్తం చేశారు. కాల్ చేసింది ఎవరు..? ఎక్కడి నుంచి ఫోన్ చేశారని ఆరా తీస్తున్నారు. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర రానున్నారు. ఇంతలో బెదరింపు కాల్ రావడంతో ముంబై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.



సల్మాన్‌తో క్లోజ్‌గా ఉండటంతో

బాబా సిద్దిఖీ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండటంతో హతమార్చామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ప్రకటించారు. బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో సిద్ధిఖీ కుమారుడు జీశాన్ కూడా ఉన్నారు. అతనికి కూడా ఇటీవల బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇతర ప్రముఖులకు లారెన్స్ గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు కాల్స్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వీవీఐపీల భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని స్పష్టం చేశారు.


బెదిరించింది మహిళ

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హతమారుస్తామని బెదిరించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 24 ఏళ్ల ఫాతిమా ఖాన్ బెదిరింపు మెసేజ్ పంపించారని వెల్లడించారు. ఫాతిమా మానసిక సమస్యలతో బాధ పడుతుందని పేర్కొన్నారు. బీఎస్సీలో ఐటీ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిందని తెలిపారు. ముంబై సమీపంలో గల థానేలో ఫాతిమా కుటుంబంతో కలిసి ఉంటుందని, ఆమె తండ్రి టింబర్ వ్యాపారం చేస్తారని వవరించారు.

Also Read: మాచర్ల ఎమ్మెల్యే బావమరిదిపై దాడి..

For National News And Telugu News...

Updated Date - Nov 03 , 2024 | 12:37 PM