ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TMC MP: నా కుటుంబాన్ని దుర్భాషలాడారు..అందుకే బాటిల్ పగులగొట్టా

ABN, Publish Date - Oct 29 , 2024 | 06:04 PM

వక్ఫ్ బిల్లుపై జేపీసీ సమావేశంలో వాదన ప్రారంభించిన వారిని మందలించకుండా తనను మందలించడంతో తనకు కోపం వచ్చిందని కల్యాణ్ బెనర్జీ చెప్పారు. ఆ కోపంలోనే బాటిల్‌ను పగులగొట్టానని, తన చేతి వేళ్లకు గాయలయ్యాయని చెప్పారు.

న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై అక్టోబర్ 22న జరిగిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) సమావేశంలో గ్లాస్ బాటిల్ పగులగొట్టి కమిటీ చైర్‌పర్సన్‌ జగదాంబికా పాల్‌పై విసిరేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) సరిగ్గా వారం రోజుల తర్వాత మంగళవారంనాడు దీనిపై స్పందించారు. తాను ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందో వివరించారు. ఘటన జరిగిన మరుసటి రోజే తాను వివరణ ఇచ్చానని, చైర్‌పర్సన్‌పై బాటిల్ విసిరే ఆలోచన తనకు లేదని, అందుకు సారీ చెబుతున్నానని కూడా సమావేశంలో తాను చెప్పినట్టు కల్యాణ్ బెనర్జీ మీడియాకు వివరించారు.

PM Modi: ఆ రెండు రాష్ట్రాల వయోవృద్ధులకు మోదీ క్షమాపణ


జేపీసీ సమావేశంలో ఏం జరిగిందో మరింత వివరిస్తూ, కోల్‌కతా హైకోర్టు మాజీ జడ్జి, బీజేపీ లోక్‌సభ నేత అభిజిత్ గంగోపాధ్యాయ గట్టిగా తన స్వరం పెంచడంతో ఆయనను తాను నిలదీశానని, ఆయన తనను, తన కుటుంబసభ్యులపై అవమానకర వ్యాఖ్యలు చేశారని కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు. తాను స్పందించినప్పటికీ ఆయన పరుషపదజాలం వాడుతూనే ఉన్నారని చెప్పారు. జేపీసీ చీఫ్ పాల్ సైతం తన పట్ల కఠినంగా, గంగోపాధ్యాయ్ పట్ల సుతిమెత్తగా వ్యవహరించారని తెలిపారు.


సమావేశంలో వాదన ప్రారంభించిన వారిని మందలించకుండా తనను మందలించడంతో తనకు కోపం వచ్చిందని కల్యాణ్ బెనర్జీ చెప్పారు. ఆ కోపంలోనే బాటిల్‌ను పగులగొట్టానని, తన చేతి వేళ్లకు గాయలయ్యాయని చెప్పారు. ఆ తర్వాత బాటిల్‌ను తాను పట్టించుకోలేదని, అయితే అది చైర్‌పర్సన్‌ వైపు దొర్లుకుంటూ వెళ్లిందని వివరించారు. ఒక జడ్జిగా పశ్చిమబెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గంగోపాధ్యాయ్ తీర్పులు ఇచ్చారని, తమ మధ్య ఉద్రికత్తలు చోటుచేసుకోవడానికి అదో కారణమని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు

ఉగ్రవాదుల చేతుల్లో ఆర్మీ శునకం ఫాంటమ్ మృతి.. ఎలా జరిగిందంటే

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 29 , 2024 | 06:04 PM