ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata Doctor Rape Case: చనిపోయిన తర్వాత మూడు కాల్స్.. ఎక్కడి నుంచి వచ్చాయంటే

ABN, Publish Date - Aug 29 , 2024 | 06:31 PM

కోల్‌కతాలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాలలోని జూనియర్ డాక్టర్ మృతి కేసులో మిస్టరీ వీడటం లేదు. సీబీఐ దర్యాప్తు చేస్తున్నా అసలు విషయం బయటకు రావడంలేదు. ఇప్పటికే ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించి విచారణ ప్రారంభించింది.

Kolkata Rape Case

కోల్‌కతాలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాలలోని జూనియర్ డాక్టర్ మృతి కేసులో మిస్టరీ వీడటం లేదు. సీబీఐ దర్యాప్తు చేస్తున్నా అసలు విషయం బయటకు రావడంలేదు. ఇప్పటికే ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించి విచారణ ప్రారంభించింది. అభయ చనిపోవడానికి ముందు రోజు రాత్రి తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. ఆ సమయంలో ఇదే చివరి కాల్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. దీంతో ఎప్పటిలాగే తన కుమార్తెతో మాట్లాడి పెట్టేసింది. ఆ తరువాత రోజు అంటే ఆగష్టు9వ తేదీ ఉదయం అరగంట వ్యవధిలో ఆసుపత్రి నుంచి వచ్చిన మూడు ఫోన్ కాల్స్ ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. వారి ఆనందాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇంతకీ ఆ మూడు కాల్స్ ఎవరు చేశారు. ఏమి మాట్లాడారనే సమాచారం బయటకు వచ్చింది.

Viral Video: మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యర్థిని ఓడించిన రాహుల్ గాంధీ


మొదటి కాల్..

ఆర్ జీ కర్ ఆసుపత్రి నుంచి ఆగష్టు9వ తేదీ ఉదయం 10.53 గంటలకు మొదటి కాల్ వచ్చింది. ఒక మహిళ ఆ కాల్‌లో మాట్లాడారు. ఫోన్‌ను అభయ తండ్రి లిఫ్ట్ చేయగా వారి మధ్య జరిగిన సంభాషణ..

ఆసుపత్రి సిబ్బంది: మీ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది.. దయచేసి త్వరగా రండి

అభయ తండ్రి: ఎవరు మాట్లాడుతున్నారు.. ఏం జరిగింది.. దయచేసి చెప్పండి..

ఆసుపత్రి సిబ్బంది: డాక్టర్ చెప్తారు, మీరు త్వరగా రండి

అభయ తండ్రి: మీరు ఎవరు

ఆసుపత్రి సిబ్బంది: నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ను

అభయ తండ్రి: డాక్టర్ లేరా

ఆసుపత్రి సిబ్బంది: మీ అమ్మాయిని ఎమర్జెన్సీకి తీసుకొచ్చాము. మీరు ఆస్పత్రికి వచ్చి మమల్ని కలవండి

అభయ తల్లి: మా కుమార్తెకు ఏమైంది. ఆమె డ్యూటీలో ఉంది కదా.

ఆసుపత్రి సిబ్బంది: మీరు వీలైనంత త్వరగా రండి


రెండవ కాల్

రెండో ఫోన్‌కాల్‌ చేసే సమయానికి అభయ తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు.

ఆసుపత్రి సిబ్బంది: నేను ఆర్ జీ కర్ ఆస్పత్రి నుంచి మాట్లాడుతున్నాను

అభయ తల్లి: చెప్పండి

ఆసుపత్రి సిబ్బంది: మీరు వస్తున్నారా

అభయ తల్లి: అవును వస్తున్నాం. మా కుమార్తె ఇప్పుడు ఎలా ఉంది?

ఆసుపత్రి సిబ్బంది: మీరు రండి మాట్లాడుకుందాం.. వచ్చిన వెంటనే ఆసుపత్రిలోని ఛాతీ విభాగం హెచ్‌వోడి వద్దకు రండి

అభయ తల్లి: సరే వస్తాము..


మూడవ కాల్

మూడో కాల్‌లో అభయ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు తెలిపారు. మొదటి కాల్ చేసిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ నుంచి మూడో కాల్ వచ్చింది.

అభయ తండ్రి: హాలో

ఆసుపత్రి సిబ్బంది: నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్‌

అభయ తండ్రి: చెప్పండి

ఆసుపత్రి సిబ్బంది: మీ కుమార్తె చనిపోయింది. ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు. దయచేసి వీలైనంత త్వరగా రండి.

అభయ తండ్రి: మేము వెంటనే వస్తున్నాం

పక్కనే ఉన్న అభయ తల్లి నా బిడ్డ ఇక లేదంటూ గట్టిగా అరుస్తూ ఏడ్వడం మొదలుపెట్టారు.

Simranjit Singh Mann: ఎంపీ కంగనా రనౌత్‌పై పంజాబ్ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు


తమ బిడ్డ చనిపోయిన తర్వాత ఆమెను చూడటానికి మూడు గంటల పాటు నిరీక్షించేలా చేశారని అభయ తల్లిదండ్రులు చెబుతున్నారు. హైకోర్టులో వేసిన పిటిషన్, సుప్రీంకోర్టులోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం జరిగినట్లు వారు అనుమానిస్తున్నారు. కోల్‌కతా పోలీసులు మాత్రం ఈ వాదనను వ్యతిరేకిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం అభయ తల్లిదండ్రులు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆసుపత్రికి చేరుకున్నారు. వారిని సెమినార్‌ హాలుకు తీసుకెళ్లారు. అక్కడే పది నిమిషాల తర్వాత మృతదేహన్ని వాళ్లకు చూపించారని కోల్‌కతా పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ కేసులో అప్పటి ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ నేతృత్వంలోని ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారులు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని, పోలీసులు అసహజ మరణం కేసును ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందని కోర్టు ప్రశ్నించింది. బాధితురాలి తండ్రి అధికారికంగా ఫిర్యాదు చేయడంతో అర్థరాత్రి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో ఈకేసులో ఏం జరిగిందనే అనుమానాలు మరింతగా బలపడ్డాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ సీబీఐ నేతృత్వంలో జరుగుతోంది.

Smriti Irani: ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 29 , 2024 | 06:31 PM

Advertising
Advertising