ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Karnataka : కర్ణాటకలో ‘ముడా’ స్కాం కలకలం

ABN, Publish Date - Jul 11 , 2024 | 06:01 AM

కర్ణాటక రాజకీయాల్లో మైసూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా) కుంభకోణం వ్యవహా రం కలకలం రేపుతోంది. ఇందులో ముఖ్యమం త్రి సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతితో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉందంటూ విజయనగర పోలీసులకు ఫిర్యాదు అందింది.

  • 8 ముఖ్యమంత్రి సతీమణి ప్రమేయంపై ఆరోపణలు

  • 8 ఆమెతో పాటు మరో ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు

  • 8 ఖజానాకు 4000 కోట్ల నష్టం వాటిల్లిందని బీజేపీ విమర్శ

  • 8 సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌

బెంగళూరు, జూలై 10(ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాజకీయాల్లో మైసూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా) కుంభకోణం వ్యవహా రం కలకలం రేపుతోంది. ఇందులో ముఖ్యమం త్రి సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతితో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉందంటూ విజయనగర పోలీసులకు ఫిర్యాదు అందింది. సిద్దరామయ్య, పార్వతి, ముడా అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఆయన ఫిర్యాదును స్వీకరించలేదు. ఇప్పటికే ముడాలో అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. పార్వతికి ఆమె సోదరుడు 1998లో ఇచ్చిన భూమికి నష్ట పరిహారం లభించిందని ముఖ్యమంత్రి చెబుతుండగా.. ఆ భూమిని మల్లికార్జున 2004లో కొనుగోలు చేసి 2010లో పార్వతికి బహుమతిగా ఇచ్చారని స్నేహమయి కృష్ణ చెబుతున్నారు. ఈ భూమి అప్పటికే డీనోటిఫై చేసినా వ్యవసాయ భూమిగా తప్పుగా చూపారని ఆరోపించారు. ఆ తర్వాత ఆ భూమిని ముడా సేకరించిందని.. అందుకు పరిహారంగా 2021లో దక్షిణ మైసూరులో అత్యంత ఖరీదైన 38,283 చదరపు గజాల స్థలాన్ని పార్వతి పొందారని తెలిపారు.


అయితే ప్రభుత్వం, రెవెన్యూ అధికారుల సహాయంతో ఫోర్జరీ పత్రాలతో మల్లికార్జున ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించారని స్నేహమయి కృష్ణ ఆరోపించారు. 1998లోనే ఆ భూమి కొనుగోలు చేసినట్టుగా చూపి, 2014లో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్వతి లబ్ధి పొందారని తీవ్ర విమర్శలు చేశారు. కాగా.. ముడాలో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి సతీమణి పార్వతి భూకేటాయింపు ద్వారా అనుచిత లబ్ధి పొందారని ఇప్పటికే బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముడా లేఔట్‌ అభివృద్ధికి సేకరించిన భూమికి పరిహారంగా ప్రస్తుత ముఖ్యమంత్రి సతీమణి సహా పలువురు ప్రముఖులు మైసూరులో ఖరీదైన భూములను పొందారనేది ప్రధాన ఆరోపణ. ముడా సేకరించిన భూమి కంటే పరిహారంగా చెల్లించిన భూమి అనేక రెట్లు విలువైనదని.. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు రూ.4000 కోట్లు నష్టం వాటిల్లిందని కమలనాథులు ఆరోపిస్తున్నారు.


ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని శాసనసభలో ప్రతిపక్ష నేత ఆర్‌.అశోక డిమాండ్‌ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి, జేడీఎస్‌ నేత కుమారస్వామి స్పందిస్తూ.. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మధ్య అధిపత్య పోరులో భాగంగానే ముడా కుంభకోణం తెరపైకి వచ్చిందని తెలిపారు. ఈ వివాదంపై సిద్దరామయ్య స్పం దించారు. ‘నా భార్యకు ముడా కేటాయించిన ఇంటి స్థలాల విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోంది. శాసనసభ సమావేశాల్లో ఈ అంశా న్ని ప్రస్తావిస్తే సమాధానం చెబుతా’ అని ఆయన అన్నారు. మైసూరులో బుధవారం మాట్లాడిన సిద్దరామయ్య.. ఒకే విషయాన్ని ఎన్నిసార్లు ప్రశ్నిస్తారని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడా నుంచి 50:50 నిష్పత్తి లో 2019లో బీజేపీ హయాంలోనే ఇంటి స్థలా లు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.

Updated Date - Jul 11 , 2024 | 06:01 AM

Advertising
Advertising
<