Nagendra: మళ్లీ కేబినెట్‌లోకి నాగేంద్ర..
ABN, Publish Date - Nov 27 , 2024 | 12:39 PM
వాల్మీకి కార్పొరేషన్(Valmiki Corporation)లో అవినీతి ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన నాగేంద్ర(Nagendra)ను మళ్లీ కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నాగేంద్రకు సిద్దరామయ్య కేబినెట్‌లో బెర్త్ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
- ఎన్నికల ప్రచారంలో సీఎం సిద్దరామయ్య హామీ
- విస్తరణ కోసం అనుచరుల ఎదురుచూపు
బళ్లారి(బెంగళూరు): వాల్మీకి కార్పొరేషన్(Valmiki Corporation)లో అవినీతి ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన నాగేంద్ర(Nagendra)ను మళ్లీ కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నాగేంద్రకు సిద్దరామయ్య కేబినెట్‌లో బెర్త్ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే ఏ శాఖ ఇస్తారనేది స్పష్టత లేదు. మంత్రి వర్గ సమావేశం తర్వాత నాగేంద్రకు పదవి ఇస్తారని కాంగ్రెస్ వర్గాలతో పాటు కొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయ పడుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Kamal Haasan: భారత రాజ్యాంగ విలువలు తెలుసుకోవాలి..
బళ్లారి రూరల్ నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, కాకలు తీరిన నాయకుడిగా పేరొందిన మాజీ మంత్రి బి. శ్రీరాములు(B. Sriramulu)పై నాగేంద్ర అఖండ విజయం సాధించారు. అప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాగేంద్రకు పైగా శ్రీరాములుపై గెలవడంతో కేబినెట్‌లో కీలక హోదా దక్కింది. అనూహ్య పరిణామాలతో ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఎస్టీ కార్పొరేషన్‌లో రూ.189 కోట్లు అక్రమాల అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఈడీ అరెస్టుతో దాదాపు 100 రోజులు జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ఇటీవల బెయిల్‌పై ఆయన బయటికి వచ్చారు. వాల్మీకీ నిగమ మండలిలో ఏ అవినీతి జరగలేదు. అని ఏకంగా సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) సర్టిఫికేట్ ఇచ్చారు. నాగేంద్రకు మళ్లీ మంత్రి పదవి ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. నాగేంద్రకు కేబినెట్‌లోకి తీసుకువస్తే కొందరు మంత్రులకు శాఖలమార్పు కూడా తప్పదని అనిపిస్తోంది.
కొందరు పాత మంత్రులను తప్పించి కొత్తగా కొందరిని మంత్రు పదవులు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఢీల్లీ నుంచి సంకేతాలు వచ్చినట్లు సమాచారం. నాగేంద్ర వర్గీయులు మాత్రం నేడు, లేదా రేపు లో మంత్రి పదవి ప్రకటించే అవకాశం ఉంది. లేదా మరో వారంలో మంత్రి వర్గం అత్యవసర సమావేశం ఉంటుంది. అప్పుడు మంత్రి పదవి వరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: ఎముకలు కొరికే చలి
ఈవార్తను కూడా చదవండి: అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!
ఈవార్తను కూడా చదవండి: హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు
ఈవార్తను కూడా చదవండి: రేవంత్.. నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..
Read Latest Telangana News and National News
Updated Date - Nov 27 , 2024 | 12:39 PM