Nagpur: నగదు కోసం శిశువు విక్రయం: ఆరుగురు అరెస్ట్
ABN, Publish Date - Aug 28 , 2024 | 08:57 AM
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అయిదు రోజుల కిందట జన్మించిన శిశువును విక్రయించాలని నాగ్‌పూర్‌లోని దంపతులు సునీల్, శ్వేత నిర్ణయించారు. ఆ క్రమంలో స్థానిక మధ్యవర్తులను సంప్రదించారు. థానే జిల్లాలోని బద్లాపూర్‌లో మధ్యవర్తలు బంధువులు పౌర్ణిమా, స్నేహదీప్ దంపతులు ఆ శిశువును కొనుగోలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
ముంబయి, ఆగస్ట్ 28: నవజాత శిశువును రూ. 1.10 లక్షలకు విక్రయించిన కేసులో ఆరుగురు వ్యక్తులను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ స్క్వాడ్ (ఏఎహ్‌టీఎస్) అరెస్ట్ చేసింది. శిశువును స్వాధీనం చేసుకుని.. స్థానిక శిశు సంరక్షణ కేంద్రానికి తరలించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అయిదు రోజుల కిందట జన్మించిన శిశువును విక్రయించాలని నాగ్‌పూర్‌లోని దంపతులు సునీల్, శ్వేత నిర్ణయించారు.
Himachal Pradesh: కంగన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం
ఆ క్రమంలో స్థానిక మధ్యవర్తులను సంప్రదించారు. థానే జిల్లాలోని బద్లాపూర్‌లో మధ్యవర్తలు బంధువులు పౌర్ణిమా, స్నేహదీప్ దంపతులు ఆ శిశువును కొనుగోలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అలా ఆగస్ట్ 22వ తేదీన రూ. 1.10 లక్షల నగదు చెల్లించి ఆ శిశువును కొనుగోలు చేశారు. ఇక శిశువును దత్తత తీసుకునేందుకు పౌర్ణిమా, స్నేహదీప్ దంపతులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ క్రమంలో ఈ వ్యవహారం బహిర్గతమైంది.
దాంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ స్క్వాడ్‌కు సమాచారం అందడంతో.. ఆ బృందం రంగంలోకి దిగింది. శిశువు తల్లిదండ్రులు సునీల్, శ్వేత, ఇద్దరు మధ్యవర్తులు కిరణ్, ప్రమోదులతోపాటు పౌర్ణిమా, స్నేహదీప్ దంపతులను అరెస్ట్ చేశారు. నాగ్‌పూర్‌లోని కలమ్నా పోలీస్ స్టేషన్‌లో ఈ అరుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏఎహ్‌టీఎస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. బాబు జన్మించిన అయిదురోజులకే అతడిని విక్రయించినట్లు సునీల్, శ్వేత.. తమ విచారణలో వెల్లడించారన్నారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Aug 28 , 2024 | 09:02 AM