Eid 2024: ఢిల్లీ చరిత్రలో తొలిసారి.. ముస్లింల ప్రార్థనలు ఇలా..!!
ABN , Publish Date - Apr 11 , 2024 | 08:09 PM
దేశ రాజధాని ఢిల్లీలో ముస్లింల పవిత్ర పండగ రంజాన్ ఘనంగా జరిగింది. ఉదయాన్నే ముస్లింలు మసీదుల వద్దకొచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గతంలో రహదారులపై నమాజ్ చేసేవారు. ఈ సారి అందుకు భిన్నంగా మసీదు లోపల చేశారు. ఇదే విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ముస్లింల పవిత్ర పండగ రంజాన్ ఘనంగా జరిగింది. ఉదయాన్నే ముస్లింలు మసీదుల వద్దకొచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గతంలో రహదారులపై నమాజ్ చేసేవారు. ఈ సారి అందుకు భిన్నంగా మసీదు లోపల చేశారు. ఇదే విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఢిల్లీలో (Delhi) అందరూ సామరస్యంగా ఉన్నారని పేర్కొన్నారు.
PM Modi: ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం: ప్రధాని మోదీ
‘ఢిల్లీలో రంజాన్ పండగ చక్కగా జరిగింది. ముస్లింలు అందరూ సోదరభావంతో మెలిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఢిల్లీలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు కృషి చేసిన మసీదు, ఈద్గాల ఇమామ్‌లకు ధన్యవాదాలు. ఇదొక్కటే కాదు, ఏ సమస్య అయినా సరే కలిసి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది అని’ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ట్వీట్లు చేశారు.
Paris Tour: ప్రజాధనంతో ప్యారిస్‌లో అధికారుల చక్కర్లు
ముస్లింలు అందరూ మసీదుల్లో ఉండటంతో ఈ రోజు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగలేదని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా పేర్కొన్నారు. ఢిల్లీ చరిత్రలో తొలిసారి ముస్లిం సోదరులు మసీదుల్లో నమాజ్ చేశారని మరోసారి గుర్తుచేశారు. రంజాన్ సందర్భంగా ముస్లింల ప్రార్థనలకు సంబంధించి ఈ నెల 4వ తేదీన ముస్లిం పెద్దలతో ఎల్జీ సక్సేనా సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. దాంతో పండగ శాంతియుత వాతావరణంలో జరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం