ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఢిల్లీలో రూ.900 కోట్ల కొకైన్‌ స్వాధీనం

ABN, Publish Date - Nov 16 , 2024 | 03:43 AM

పశ్చిమ ఢిల్లీలో సుమారు రూ.900 కోట్లు విలువ చేసే 82 కిలోల నాణ్యమైన కొకైన్‌ను శుక్రవారం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌, నవంబరు 15: పశ్చిమ ఢిల్లీలో సుమారు రూ.900 కోట్లు విలువ చేసే 82 కిలోల నాణ్యమైన కొకైన్‌ను శుక్రవారం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాకు అక్రమంగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తుండగా కొరియర్‌ ఆఫీసు వద్ద పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అదే సమయంలో గుజరాత్‌ తీరంలో ఇండియన్‌ నేవీ, యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌లు కలిపి 700 కిలోల మెటంఫాటామైన్‌ మాదకద్రవాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఎనిమిది మంది ఇరాన్‌ జాతీయులను అరెస్టు చేశాయి. ఒకే రోజున ఇంత భారీ మొత్తంలో మత్తుపదార్థాలను పట్టుకున్నందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సిబ్బందిని అభినందించారు.

Updated Date - Nov 16 , 2024 | 03:43 AM