Modi: నేడు రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ
ABN, Publish Date - Feb 19 , 2024 | 08:35 AM
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన 14,000 ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. సోమవారం జరిగే యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నాల్గో గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకలో భాగంగా ప్రధాని ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన 14,000 ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. సోమవారం జరిగే యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నాల్గో గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకలో భాగంగా ప్రధాని ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10:30 గంటల సమయంలో సంభాల్ జిల్లాలో శ్రీకల్కి ధామ్ ఆలయానికి ప్రధానిమంత్రి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే శ్రీకల్కి ధామ్ ఆలయం నమూనాను కూడా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న సభలో ప్రధాని ప్రసంగిస్తారు. కాగా శ్రీకల్కి ధామ్ ఆలయం నిర్మాణాన్ని ఆలస ట్రస్ట్ చేపట్టనుంది. ఈ ఆలయ ట్రస్ట్ చైర్మన్‌గా ఆచార్య ప్రమోద్ కృష్ణం ఉన్నారు. శ్రీకల్కి ధామ్ ఆలయ ప్రారంభోత్సవానికి పలువురు సాధువులు, మత పెద్దలు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.
అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు ఫిబ్రవరిలో జరిగిన యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 (యూపీజీఐఎస్ 2023) సందర్భంగా స్వీకరించిన రూ.10 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన 14000 ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్ట్‌లు పునరుత్పాదక శక్తి, ఐటీ, ఐటీఈఎస్, ఫుడ్ ప్రాసెసింగ్, హౌసింగ్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, వినోదం, విద్య వంటి రంగాలకు సంబంధించినవి. కాగా ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అగ్రశ్రేణి గ్లోబల్, భారతీయ కంపెనీల ప్రతినిధులు, రాయబారులు, హైకమిషనర్లు, ఇతర విశిష్ట అతిథులతో సహా సుమారు 5000 మంది పాల్గొననున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 19 , 2024 | 08:49 AM