ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National : ఆదాయ పన్ను మినహాయింపు 5లక్షలకు పెంపు!

ABN, Publish Date - Jun 19 , 2024 | 06:35 AM

కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న 2024-25 బడ్జెట్‌లోనూ వేతన జీవులకు ఊరట లభించే అవకాశం లేదా? పాత పన్ను విధానంలో ఉన్నవారిని పక్కనపెట్టి నూతన పన్ను విధానం(న్యూ ట్యాక్స్‌ రెజీమ్‌)లో ఉన్న వారికే ప్రభుత్వం రాయితీలు ఇవ్వనుందా?

నూతన పన్ను విధానంలో ఉన్నవారికే.. బడ్జెట్‌పై కొనసాగుతున్న కసరత్తు

న్యూఢిల్లీ, జూన్‌ 18: కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న 2024-25 బడ్జెట్‌లోనూ వేతన జీవులకు ఊరట లభించే అవకాశం లేదా? పాత పన్ను విధానంలో ఉన్నవారిని పక్కనపెట్టి నూతన పన్ను విధానం(న్యూ ట్యాక్స్‌ రెజీమ్‌)లో ఉన్న వారికే ప్రభుత్వం రాయితీలు ఇవ్వనుందా? అంటే సంబంధిత వర్గాలు అవుననే అంటున్నాయి.

ఐటీ మినహాయింపు పరిమితిని ప్రభుత్వం రూ.3లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, ఈ పెంపు కేవలం నూతన ఆదాయపు పన్ను విధానం(న్యూ ట్యాక్స్‌ రెజీమ్‌)లో ఉన్నవారికి మాత్రమే వర్తింపు చేయనున్నారని పేర్కొన్నారు. మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచి జీడీపీ వృద్ధికి తోడ్పడేందుకు, నూతన ఆదాయపు పన్ను విధానం వైపు ప్రజలను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోందని వివరించారు.

బడ్జెట్‌ ప్రవేశ పెట్టడానికి కొద్ది రోజుల ముందు ప్రభుత్వం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కాగా, నూతన పన్ను విధానంలో రూ.15 లక్షలకు పైబడి వార్షిక ఆదాయం కలిగిన వారి నుంచి అత్యధికంగా 30 %ఆదాయపు పన్ను వసూలు చేస్తున్నారు. దీన్ని 25 శాతానికి తగ్గించాలనే విజ్ఞప్తులను ప్రభుత్వం బడ్జెట్‌ రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవడం లేదని మరో అధికారి వెల్లడించారు. అలాగే, పాత విధానంలో రూ.10 లక్షలకు పైబడి వార్షిక ఆదాయం కలిగిన వారి నుంచి ప్రస్తుతం 30ు ఆదాయపు పన్ను వసూలు చేస్తున్నారు. ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాలనే వినతులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు.

Updated Date - Jun 19 , 2024 | 06:35 AM

Advertising
Advertising