ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National : ఎన్‌టీఏలో సంస్కరణలు!

ABN, Publish Date - Jun 19 , 2024 | 06:03 AM

నీట్‌ పరీక్షల వివాదాల నేపథ్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)లో కీలక సంస్కరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎన్‌టీఏ కార్యకలాపాలు, పరీక్షల నిర్వహణలో విస్తృత మార్పులను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సూచనలకు ఉన్నత స్థాయి కమిటీ

కేంద్ర ఉన్నతాధికారి ఒకరు వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 18: నీట్‌ పరీక్షల వివాదాల నేపథ్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)లో కీలక సంస్కరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎన్‌టీఏ కార్యకలాపాలు, పరీక్షల నిర్వహణలో విస్తృత మార్పులను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్పులను సూచించేందుకు ఉన్నతస్థాయి కమిటీని వేసే అవకాశం ఉంది. ఈ నెల 4న వెలువడిన నీట్‌ ఫలితాలు దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

విద్యార్థులు మూడు అంశాలను ప్రధానంగా లేవనెత్తుతున్నారు. 1) కొంతమంది విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు ఇవ్వడం, 2) కొన్నిచోట్ల పరీక్ష పేపర్‌ లీక్‌ అయినట్లు ఆరోపణలు, 3) కొన్ని పరీక్ష కేంద్రాల్లో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరపాలని, పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎక్కువ మంది కోరుతున్నారు. నీట్‌ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డట్లు రుజువైతే బాధ్యులకు అత్యంత కఠినమైన శిక్ష పడేట్లు చూస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గత ఆదివారం హామీ ఇచ్చారు.

ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, ‘‘ప్రస్తుతం వ్యవహారం కోర్టుల్లో ఉంది. విద్యాశాఖ, ఎన్‌టీఏ సమస్య వివరాలను పరిశీలిస్తున్నాయి. దర్యాప్తు, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుత సమస్య పరిష్కారం అవుతుంది. అది పూర్తవగానే నీట్‌ పరీక్షలకు సంబంధించి కీలక సంస్కరణలు జరుగుతాయి’’ అన్నారు. ఇందుకోసం విద్యాశాఖ కమిటీని వేయనుందని చెప్పారు. 2023 నవంబరులో ఎన్‌టీఏలో వివిధ పరీక్షలు రాయడానికి 1.23 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. చైనాలోని గావ్‌కావ్‌ పరీక్ష తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద పోటీ పరీక్ష వ్యవస్థ ఎన్‌టీఏ. గత ఏడాది నవంబరులో నీట్‌ యూజీ పరీక్ష రాయడానికి 24 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఎన్‌టీఏ కింద జేఈఈ(14.7 లక్షల మంది), క్యూట్‌యూజీ(13.4 లక్షల మంది) నమోదు చేసుకున్నారు. ఇవి కాకుండా అనేక ఇతర పోటీ పరీక్షలు ఎన్‌టీఏ కిందకు వస్తాయి.

Updated Date - Jun 19 , 2024 | 06:03 AM

Advertising
Advertising