ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National : ఎస్‌ఎస్ఎల్వీ-డీ3 విజయవంతం

ABN, Publish Date - Aug 17 , 2024 | 04:53 AM

ఎస్‌ఎస్ఎల్వీ -డీ3 ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇస్రో మరో చారిత్రాత్మక మైలురాయికి చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శుక్రవారం ఉదయం 9.17 గంటలకు ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ3 రాకెట్‌ ప్రయోగం చేపట్టారు.

  • 17 నిమిషాల్లో రోదసిలోకి ఈవోఎస్‌-08 ఉపగ్రహం

  • మరింత కచ్చితంగా విపత్తుల సమాచారం

  • గగన్‌యాన్‌ ప్రయోగం డిసెంబరులోనే: సోమనాథ్‌

  • ఇస్రోకు మోదీ అభినందనలు

సూళ్లూరుపేట, ఆగస్టు 16: ఎస్‌ఎస్ఎల్వీ -డీ3 ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇస్రో మరో చారిత్రాత్మక మైలురాయికి చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శుక్రవారం ఉదయం 9.17 గంటలకు ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ3 రాకెట్‌ ప్రయోగం చేపట్టారు. ఈ రాకెట్‌ ద్వారా 175.5 కిలోల బరువున్న ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపారు. దీంతో పాటు ఎస్‌ఆర్‌-0, డెమోశాట్‌ మరో రెండు చిన్న ఉపగ్రహాలను కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. శుక్రవారం ఉదయం 9.17 గంటలకు షార్‌లోని ప్రఽథమ ప్రయోగ వేదికపై ఉన్న ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ 3 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.

నాలుగు దశల్లో సునాయాసంగా ప్రయాణించిన రాకెట్‌ తొలుత 16నిమిషాల్లో ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని భూమికి 475కిలోమీటర్ల ఎత్తులో చేర్చింది. అనంతరం నిమిషం వ్యవధిలో మరో 2చిన్న ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది.


ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరిన వెంటనే మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉన్న ఇస్రో చైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతమైనట్టు ప్రకటించారు. 500 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి తక్కువ బరువున్న ఉపగ్రహాలను ప్రవేశ పెట్టేందుకు ఎస్‌ఎ్‌సఎల్వీ వాహక నౌకను రూపొందించినట్టు తెలిపారు. తాజా ప్రయోగంతో విపత్తులను మరింత కచ్చితంగా తెలుసుకునేందుకు వీలు కలగనుంది. అదేవిధంగా సముద్ర మట్టాలు, అగ్నిపర్వతాల పరిస్థితిని కూడా అంచనావేయొచ్చు.

ఈ ఉపగ్రహం ఏడాది పాటు పనిచేయనుంది. మూడేళ్లపాటు తీవ్రంగా శ్రమించిన ఇస్రో శాస్త్రవేత్తలు.. స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(ఎ్‌సఎ్‌సఎల్వీ)ను రూపొందించడంలో విజయం సాఽఽధించారు. దీంతో ఇంధన ఆదాతో పాటు తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు శ్రీకారం చుట్టారు. ప్రపంచ దేశాల్లో భారత శాస్త్రవేత్తల సత్తా ఏమిటో నిరూపించారు.

ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించిన 5 రకాల రాకెట్లతో పాటు ప్రస్తుతం సరికొత్త రాకెట్‌ చేరింది. ఏఎ్‌సఎల్వీ, ఎస్‌ఎల్వీ, పీఎ్‌సఎల్వీ, జీఎ్‌సఎల్వీ, జీఎ్‌సఎల్వీ-మార్క్‌3 తర్వాత ఎస్‌ఎ్‌సఎల్వీ ఆరో వరుసలో ఆరో రాకెట్‌గా చేరింది. ఎస్‌ఎ్‌సఎల్‌వీ-డీ3 ప్రయోగం విజయంవంతం కావడం పట్ట ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష రంగంలో ఇది అతిగొప్ప మైలురాయి అని పేర్కొన్నారు.


  • క్రియోస్పియర్‌ అధ్యయనం..

భారత రాకెట్‌ ప్రయోగాల్లో ఇప్పుడు సరికొత్త వాహక నౌక చేరిందని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ అన్నారు. ఈవోఎస్‌-08 భూ పరిశీలన ఉపగ్రహమని, ఇందులో ఉండే ఎలకో్ట్ర ఆప్టికల్‌ ఇన్‌ఫ్రా రెడ్‌(ఈవోఐఆర్‌) పేలోడ్‌ మిడ్‌వేవ్‌, లాంగ్‌వేవ్‌ ఇన్‌ఫ్రా-రెడ్‌లో చిత్రాలను క్యాప్చర్‌ చేసి పంపిస్తుందన్నారు.

విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈవోఎస్‌-08 ఉపగ్రహం హిమాలయాల్లోని క్రియోస్పియర్‌ అధ్యయనం కోసం ప్రధానంగా పని చేస్తుందన్నారు. భవిష్యత్‌లో బుల్లి ఉపగ్రహాలను తక్కువ ఎత్తులోకి ఈ రాకెట్‌ ద్వారా పంపేందుకు సులువుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఎస్‌ఎ్‌సఎల్వీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.

ఇకపై చిన్న ఉపగ్రహాలు ఎస్‌ఎ్‌సఎల్వీ వాహక నౌక ద్వారానే పంపుతామన్నారు. ఈ ఏడాది డిసెంబరులో గగన్‌యాన్‌ ప్రయోగం కూడా ఉంటుందన్నారు. దీంతో పాటు పీఎ్‌సఎల్వీ, జీఎ్‌సఎల్వీ-మార్క్‌3 ప్రయోగం ఉంటుందని వెల్లడించారు.

Updated Date - Aug 17 , 2024 | 04:53 AM

Advertising
Advertising
<