Assembly Elections: సీఎంగా ఉచిత విద్యుత్‌పై తొలి ఉత్తర్వులు
ABN, Publish Date - May 16 , 2024 | 05:39 PM
నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ పార్టీ అధికారంలోకి రాగానే ఒడిశా ప్రజలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. నవీన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే.. ఈ ఉచిత విద్యుత్‌పై తొలి ఉత్తర్వులు జారీ చేస్తారని పేర్కొంది.
భువనేశ్వర్, మే 16: నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ పార్టీ అధికారంలోకి రాగానే ఒడిశా ప్రజలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. నవీన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే.. ఈ ఉచిత విద్యుత్‌పై తొలి ఉత్తర్వులు జారీ చేస్తారని పేర్కొంది. ఈ మేరకు నవీన్ పట్నాయక్ సన్నిహితుడు వీకే పాండ్యన్ వెల్లడించారు.
LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!
జూన్ 9వ తేదీన ఆ దేవ దేవుడు జగన్నాథ స్వామి, ప్రజలు ఆశీర్వాదంతో నవీన్ పట్నాయక్ ఆరోసారి ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ఈ ఉచిత విద్యుత్ వల్ల ఒడిశాలోని 90 శాతం మంది ప్రజలకు లబ్ది చేకూరుతుందని చెప్పారు.
National Commission for Women: బిభవ్ కుమార్‌కు సమన్లు జారీ
దేవగఢ్ జిల్లాలో సీఎం నవీన్ పట్నాయక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం నవీన్, తనకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను పాండ్యన్ ఈ సందర్బంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
AP Elections: భారీ భద్రత మధ్య ‘జేసీ ఫ్యామిలీ’ హైదరాబాద్‌కు తరలింపు
ఇక బీజేడీ తన ఎన్నికల మేనిఫెస్టోలో.. రాష్ట్రంలోని అన్ని గృహాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని స్పష్టం చేసింది. అలాగే 100 నుంచి 150 యూనిట్ల విద్యుత్ వాడకం ఉంటే.. అందులో 50 యూనిట్లు ఉచితమని పేర్కొంది. వీటి వల్ల గ్రామీణ ప్రాంత వాసులు లబ్ది పొందుతారంది.
LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!
అలాగే పట్టణ ప్రాంతంలోని గృహ వినియోగదారులకు సైతం అందువల్ల ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. ఇక రైతులకు సైతం ఉచిత విద్యుత్ అందిస్తామంది. ముఖ్యంగా పశ్చిమ ఒడిశా వాసులకు ఈ ఉచిత విద్యుత్ మరింత ప్రయోజనం కలుగుతుందని బీజేడీ తన మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
AP Elections: జేసీ ఫ్యామిలీపై పోలీసుల కక్షసాధింపు..!!
సార్వత్రిక ఎన్నికలతోపాటు ఒడిశా అసెంబ్లీకి సైతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీకి మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మే 13వ తేదీన తొలి దశ పోలింగ్ జరిగింది. మరోవైపు ఒడిశాలో అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అయితే ఒడిశా ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారనేది తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.
IncomeTax Raids:72 గంటలు తనిఖీలు: రూ.170 కోట్లు సీజ్
Read Latest AP News AND Telugu News
Updated Date - May 16 , 2024 | 05:42 PM