ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jammu and Kashmir: గెలిచేది మేమే, వచ్చేది మా ప్రభుత్వమే: ఒమర్

ABN, Publish Date - Sep 28 , 2024 | 08:43 PM

బీజేపీ గెలుపు అవకాశాలపై ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, సొంతంగా మెజారిటీ సాధించేందుకు అవసరమైన సీట్లులో వాళ్లు పోటీ చేయలేదన్నారు. కశ్మీర్‌లో చాలా స్థానాల్లో వాళ్లు పోటీ చేయలేదని, జమ్మూలోనూ ఎక్కువ సీట్లు గెలుచుకునే పరిస్థితిలో ఆ పార్టీ లేదని చెప్పారు.

కుప్వారా: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (Jammu and Kashmir Assembly Elections) నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి గెలుపు తథ్యమని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ (NC) ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) అన్నారు.


పోటీ లేకుండా మెజారిటీనా?

బీజేపీ గెలుపు అవకాశాలపై ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, సొంతంగా మెజారిటీ సాధించేందుకు అవసరమైన సీట్లులో వాళ్లు పోటీ చేయలేదన్నారు. కశ్మీర్‌లో చాలా స్థానాల్లో వాళ్లు పోటీ చేయలేదని, జమ్మూలోనూ ఎక్కువ సీట్లు గెలుచుకునే పరిస్థితిలో ఆ పార్టీ లేదని చెప్పారు. తమకు అక్కడా, ఇక్కడా (జమ్మూ, కశ్మీర్) బీ,సీ,డీ,ఈ టీమ్‌లు ఉన్నాయనే సంకేతాలతో వాళ్లు ప్రజలను మరోసారి ఫూల్స్ చేయాలనుకుంటున్నారని, ప్రజలకు వాళ్లేంటో బాగా తెలుసునని ఒమర్ అన్నారు. తొలి రెండు విడతల పోలింగ్ సరళిని బట్టి ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తాను అనుకుంటున్నట్టు చెప్పారు.

Priyanka Gandhi: ఆయన ఔట్ సైడర్.. పనిచేసేది కూడా ఔట్ సైడర్ల కోసమే


జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తొలగించడంలో బీజేపీ ఉద్దేశం ఏమిటని ఒమర్ ప్రశ్నించారు. అందువల్ల ఎలాంటి ప్రయోజనం ఒనగూరిందో చెప్పాలన్నారు. సుప్రీంకోర్టు మీద తమకు నమ్మకం ఉందని, ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదాను తిరిగి తెచ్చుకుంటామని ఒమర్ స్పష్టం చేశారు. కాగా, మూడు విడతల జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా మొదటి, రెండవ విడత పోలింగ్ సెప్టెంబర్ 18, 25 తేదీల్లో జరిగాయి. మూడో విడత పోలింగ్ అక్టోబర్ 1న జరుగుతుంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.


For National News And Telugu News..

Also Read: Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? కేంద్రమంత్రి కీలక ప్రకటన

Updated Date - Sep 28 , 2024 | 08:43 PM