NC MLA Detiained: బ్యాగులో రెండు బుల్లెట్లు.. నిర్బంధంలో ఎమ్మెల్యే
ABN, Publish Date - Oct 27 , 2024 | 09:04 PM
ఇటీవల జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా నియోజకవర్గం నుంచి ఎన్‌సీ అభ్యర్థిగా బషీర్ పోటీ చేశారు. పీడీపీ నేత, మోహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా మెహబూబా ముఫ్తీపై 33,299 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు.
శ్రీనగర్: అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) ఎమ్మెల్యే బషీర్ అహ్మద్ వీరి (Bashir Ahmad veeri)ని తనిఖీల సందర్భంగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ఆదివారంనాడు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయన బ్యాగ్‌లో రెండు లైవ్ బుల్లెట్లు కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ప్రశ్నించేందుకు హుమ్‌హమా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే వద్ద తుపాకీ లైసెన్స్ ఉందని, పొరపాటున బ్యాగులో రెండు బెల్లెట్లు ఉండిపోయినట్టు సమాచారం. షెడ్యూల్ ప్రకారం ఇండిగో ఫ్లైట్‌లో ఆయన జమ్మూ బయలుదేరాల్సి ఉంది.
Bomb threats: ఇవాళ ఒక్క రోజే 50 విమానాలకు బాంబు బెదిరింపులు.. కీలక నిర్ణయం దిశగా కేంద్రం
బషీర్ వివరణ
కాగా, తనకు లైసెన్స్ గన్ ఉందని, దానికి సంబంధించిన రెండు బుల్లెట్లు బ్యాగ్‌లో ఉండిపోయాయని మీడియాతో మాట్లాడుతూ బషీర్ తెలిపారు. తొలుత అధికారులు ఆర్మ్స్ లైసెన్స్ కాపీ అడిగారని, సాఫ్ట్ కాపీ చూపించడంతో హార్డ్ కాపీ కూడా చూపించమన్నారని చెప్పారు. అది కూడా చూపించడంతో ముందుకు వెళ్లేందుకు అనుమతించారని వెల్లడించారు.
ఇటీవల జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా నియోజకవర్గం నుంచి ఎన్‌సీ అభ్యర్థిగా బషీర్ పోటీ చేశారు. పీడీపీ నేత, మోహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా మెహబూబా ముఫ్తీపై 33,299 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు.
ఇవి కూడా చదవండి...
S Jaishankar: డెప్సాంగ్, దెమ్‌చోక్‌లో బలగాల ఉపసంహరణ త్వరలో పూర్తి
Palika Bazar: అనుమానాస్పద ఎలక్ట్రానికి పరికరం స్వాధీనం..ఇదెంత డేంజర్ అంటే
Maharashtra Assembly Elections: 'మహా' ప్రచారంలో బీజేపీ హేమాహేమాలు
Read More National News and Latest Telugu News
Updated Date - Oct 27 , 2024 | 09:04 PM