ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kiran Rijiju: మెజారిటీ మాదే.. ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానంలో పసలేదు

ABN, Publish Date - Dec 10 , 2024 | 07:05 PM

జగ్‌దీఫ్ ధన్‌ఖడ్ రాజ్యసభ చైర్మన్‌గా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ 'ఇండియా' కూటమి సోమవారంనాడు ఆయన అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది. అయితే తీర్మానం సభామోదం పొందాలంటే సభలో సాధారణ మెజారిటీ ఉండాలి.

న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankar)పై అవిశ్వాస తీర్మానానికి విపక్ష 'ఇండియా' కూటమి నోటీసు ఇవ్వడంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) స్పందించారు. ఎన్డీయేకు రాజ్యసభలో అవసరమైన మెజారిటీ ఉందని చెప్పారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ను తొలగించేందుకు విపక్షాలు నోటీసు ఇవ్వడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ధన్‌ఖడ్‌ పనితీరుకు కేంద్రం గర్విస్తోందన్నారు.

Jagdeep Dhankar: రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు


రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ వృత్తిపరంగా పూర్తి నిబద్ధత, నిష్పాక్షిత కలిగిన వ్యక్తి అని సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ రిజిజు చెప్పారు. ''కాంగ్రెస్ సహా సుమారు 60 మంది సభ్యులు ఉపరాష్ట్రపతికి వ్యతిరేకంగా రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. సభాధ్యక్షుని తప్పనిసరిగా గౌరవించాల్సి ఉంటుంది. జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ను మేము ఎంతగానో గౌరవిస్తాం. ఉపాధ్యక్షుడికి వ్యతిరేకంగా 60 మంది ఎంపీలు నోటీసు ఇవ్వడం గర్హనీయం" అని అన్నారు.


తీర్మానం ఆమోదం పొందాలంటే..

జగ్‌దీఫ్ ధన్‌ఖడ్ రాజ్యసభ చైర్మన్‌గా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ 'ఇండియా' కూటమి సోమవారంనాడు ఆయన అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది. అయితే తీర్మానం సభామోదం పొందాలంటే సభలో సాధారణ మెజారిటీ ఉండాలి. 243 మంది సభ్యుల రాజ్యసభలో విపక్షాలకు అవసరమైన మెజారిటీ సభ్యుల బలం లేదు. అయితే, తమ చర్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి బలమైన సందేశం ఇచ్చినట్టు అవుతుందని విపక్ష సభ్యులు అంటున్నారు. కాంగ్రెస్‌తో సహా ఆర్జేడీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఆప్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలకు చెందిన 60 మంది విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేసి దానిని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి మంగళవారంనాడు అందజేశారు.


ఇవి కూడా చదవండి..

INDIA Block: మమతకు మద్దతు తెలిపిన మాజీ సీఎం

CM Stalin: సీఎం స్టాలిన్ సంచలన కామెంట్స్.. ఆ ప్రాజెక్టు అమలైతే పదవికి రాజీనామా..

For National News And Telugu News

Updated Date - Dec 10 , 2024 | 07:05 PM