World Second Largest Ropeway: మన దగ్గరే ప్రపంచంలో రెండో అతి పొడవైన రోప్‌వే నిర్మాణం..
ABN, Publish Date - Oct 14 , 2024 | 07:57 PM
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ కలల ప్రాజెక్టుకు రెక్కలొచ్చాయి. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ సిమ్లా రోప్‌వే కోసం ముందస్తు టెండర్‌ను ఆమోదించింది. దీంతో దేశంలోనే మొదటి, ప్రపంచంలోనే రెండో పొడవైన రోప్‌వే నిర్మాణం మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచంలోనే రెండో అతి పొడవైన రోప్‌వేను నిర్మించేందుకు మార్గం సుగమమైంది. రూ. 1734 కోట్లతో నిర్మించనున్న సిమ్లా ట్రాన్స్‌పోర్ట్ రోప్‌వే ప్రాజెక్టు నిర్మాణానికి అడ్వాన్స్ టెండర్ వేసేందుకు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB) అనుమతి ఇచ్చింది. దీంతో హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) రాజధాని సిమ్లా(Shimla)లో రూ.1734.40 కోట్ల వ్యయంతో 13.79 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రోప్‌వే నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఇది ప్రపంచంలోనే రెండో అతి పొడవైన రోప్‌వే అవుతుందని, భారతదేశంలో మొదటిది అని ముఖేష్ అన్నారు. ఇది 15 స్టేషన్లను కలుపుతూ కొనసాగుతుందని వెల్లడించారు.
టూరిజంతోపాటు
ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్ సిమ్లా రవాణాలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత సిమ్లాలో కొత్త రవాణా ఎంపిక అందుబాటులోకి వస్తుంది. ఇది పర్యాటకులకు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఇప్పటికే దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉన్న సిమ్లా ఈ ప్రాజెక్ట్‌తో మరింత ఆకర్షణీయంగా మారనుంది. రోప్‌వే నిర్మాణం వల్ల నగరంలో ట్రాఫిక్ జామ్ సమస్య తగ్గుతుంది.
ఉపాధి కూడా..
పర్యాటకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం సిమ్లాకే కాకుండా మొత్తం హిమాచల్ ప్రదేశ్ టూరిజం పరిశ్రమకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుంది. పర్యాటకం పెరుగుదల స్థానిక వ్యాపారులు, హోటళ్లు, ఇతర సంబంధిత సేవలకు ప్రయోజనం చేకూరుస్తుంది. నిర్మాణ పనుల్లో స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఎప్పటి నుంచి..
సిమ్లా రోప్‌వే మార్గంలో పనులు 2025లో మార్చి 1 నుంచి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రోప్‌వే మా తారా దేవి నుంచి సిమ్లా వరకు నిర్మించబడుతుంది. తొలుత మధ్య స్టేషన్‌లో 220 ట్రాలీలను ఏర్పాటు చేస్తారు. మొత్తం రోప్‌వే నిర్మాణం పూర్తయితే వాటి సంఖ్య 660కి చేరుతుంది. ఈ ప్రాజెక్ట్‌ను న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ అంటే NDB ఫాక్ట్ ఫైండింగ్ మిషన్ కింద ఈ సంవత్సరం జూన్ 2 నుంచి జూన్ 10 మధ్య తనిఖీ చేశారు. ఎన్‌డీబీ ఈ ఏడాది జూలై 12న కాన్సెప్ట్ నోట్‌ను ఆమోదించింది. ఇప్పుడు అడ్వాన్స్ టెండర్ మంజూరైంది.
ప్రపంచంలో మొదటిది ఎక్కడంటే..
మొదట్లో రోప్‌వే మార్గంలో ఒకవైపు నుంచి వెయ్యి మంది ప్రయాణిస్తారు. అదే సమయంలో రెండు వైపుల నుంచి ఒక గంటలో రెండు వేల మంది ప్రయాణించవచ్చు. ఈ మార్గం ద్వారా ప్రపంచంలోనే అతి పొడవైన రోప్‌వే మార్గం బొలీవియాలో 32 కిలోమీటర్ల పొడవు ఉంది. సిమ్లా దాని కంటే కొంచెం తక్కువగా 13.79 కి.మీ పొడవైంది.
ఇది రోప్‌వే తారా దేవి నుంచి సిమ్లా వరకు 60 కి.మీ విస్తీర్ణంలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB) ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందిస్తాయి. ఇందులో 80 శాతం రుణం ఎన్‌డీబీ నుంచి, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
Firecracker Insurance: ఫైర్‌క్రాకర్స్‌తో గాయపడితే ఇన్సూరెన్స్ పాలసీ.. ఫోన్ పే నుంచి కొత్త స్కీం..
BSNL: ఎయిర్‌టెల్, జియోకు బీఎస్ఎన్ఎల్ సవాల్.. రూ.6కే అపరిమిత కాలింగ్, 2జీబీ డేటా
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
Read More National News and Latest Telugu News
Updated Date - Oct 14 , 2024 | 08:03 PM