Share News

NEET Paper Leak: నీట్ ప్రశ్నపత్రాలను ఎంతకు అమ్మామంటే.. లీకేజ్ నిందితుడి దర్యాప్తులో కీలక విషయాలు

ABN , Publish Date - Jun 20 , 2024 | 11:16 AM

దేశ వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నా పత్రాలు లీక్(NEET Paper Leak) కావడం కలకలం సృష్టిస్తు్న్న వేళ.. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమిత్ ఆనంద్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

NEET Paper Leak: నీట్ ప్రశ్నపత్రాలను ఎంతకు అమ్మామంటే.. లీకేజ్ నిందితుడి దర్యాప్తులో కీలక విషయాలు

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నా పత్రాలు లీక్(NEET Paper Leak) కావడం కలకలం సృష్టిస్తు్న్న వేళ.. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమిత్ ఆనంద్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పరీక్షకు ఒకరోజు ముందు ప్రశ్నపత్రం లీక్ అయిందని ఈ కేసు ప్రధాన సూత్రధారి అమిత్ ఆనంద్ అంగీకరించాడు. ప్రశ్నా పత్రాలను ఎంత ధరకు అమ్మేడో కూడా వెల్లడించాడు. పరీక్షకు ఒక రోజు ముందు ప్రశ్నలకు సమాధానాలను విద్యార్థులు ఎలా గుర్తుపట్టేలా చేశారో చెప్పాడు.

ప్రశ్నాపత్రం ఇచ్చినందుకు బదులుగా విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేశారు. బిహార్‌లో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు. వారిలో అనురాగ్ యాదవ్, నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ , దానాపూర్ మునిసిపల్ కౌన్సిల్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సికందర్ యాదవ్ ఉన్నారు. అమిత్ బిహార్ రాష్ట్రం ముంగేర్ జిల్లాకు చెందినవాడు. అతను పట్నాలోని ఏజీ కాలనీలోని ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడు.


అమిత్ ఆనంద్ ఏం చెప్పాడంటే

'పరీక్షకు ఒకరోజు ముందే పేపర్ లీక్ కాగా అభ్యర్థులకు ప్రశ్నపత్రం, సమాధానాలు ఇచ్చాం. సమాధానాలను గుర్తుంచుకోవాలని రాత్రంతా చెప్పాం. ఒక్కో ప్రశ్నాపత్రం ధర రూ.30-32 లక్షలుగా నిర్ణయించాం. నా ప్లాట్‌లో నీట్ ప్రశ్నాపత్రం, జవాబు పత్రాలు కాలిపోయిన విషయం నిజమే. అంతకుముందు కూడా నేను కొన్ని ప్రశ్నాపత్రాలు లీక్ చేశాను' అని అమిత్ ఆనంద్ తన వాంగ్మూలంలో తెలిపాడు.


"నేను వ్యక్తిగత పనుల కోసం దానాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సికందర్‌ని కలవడానికి వెళ్ళాను. ఏవైనా పోటీ పరీక్షల పేపర్‌ను లీక్ చేసి అభ్యర్థులకు సహాయం చేస్తానని సికందర్‌కి చెప్పాను. నీట్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు, పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు సహాయం చేయమని నన్ను కోరారు. దీంతో పేపర్ లీక్ చేసి వారికి సాయం చేశాను' అని అమిత్ చెప్పడం కలకలం రేపుతోంది. నీట్ పరీక్ష లీకేజ్‌లో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఇంకా చాలా మందే దీని వెనక ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని అంటున్నారు.

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో సంచలనం.. ప్రశ్నాపత్రంతోపాటు సమాధానాలు సైతం..

Congress: ఇది పేపర్ లీక్ ప్రభుత్వం.. యూజీసీ - నెట్ పరీక్షల రద్దుతో బీజేపీపై విరుచుకుపడిన కాంగ్రెస్


For Latest News and National News click here

Updated Date - Jun 20 , 2024 | 11:16 AM