ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాక్‌లో సరికొత్త ‘ఉగ్ర’ ఫ్యాక్టరీ!

ABN, Publish Date - Oct 26 , 2024 | 03:02 AM

పాక్‌ నుంచి వస్తున్న ఉగ్రవాదులు కొద్దిరోజులుగా జమ్మూకశ్మీర్లో స్థానికేతరులను, సైన్యాన్ని టార్గెట్‌ చేస్తున్నారు.

న్యూఢిల్లీ, అక్టోబరు 25: పాక్‌ నుంచి వస్తున్న ఉగ్రవాదులు కొద్దిరోజులుగా జమ్మూకశ్మీర్లో స్థానికేతరులను, సైన్యాన్ని టార్గెట్‌ చేస్తున్నారు. వీరంతా పాక్‌ నెలకొల్పిన సరికొత్త టెర్రరిస్టు ఫ్యాక్టరీలో శిక్షణ పొందిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. అబోటాబాద్‌లోని పాక్‌ సైనిక కార్యాలయం పక్కనే దీనిని ఏర్పాటుచేశారు. ఇక్కడ లష్కరే తోయిబా, హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌, జైషే మొహమ్మద్‌ సంస్థలకు సంయుక్తంగా శిక్షణ ఇస్తున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. పాక్‌ గూఢచార సంస్థ (ఐఎ్‌సఐ)లో పనిచేస్తున్న ఓ జనరల్‌ స్థాయి అధికారి దీనిని పర్యవేక్షిస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ తలదాచుకున్నది ఇక్కడి రహస్య భవనంలోనే. అమెరికా ప్రత్యేక దళాలు 2011 మేలో లాడెన్‌ను మట్టుబెట్టిన తర్వాత పాక్‌ ప్రభుత్వం ఆ భవనాన్ని నేలమట్టం చేసింది.

దానిపైనే కొత్త ఉగ్రవాద ఫ్యాక్టరీ భవనాన్ని నిర్మించారా.. లేక సమీపంలో ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇక్కడ యువతీయువకులకు ఆయుధాలు, రకరకాల యుద్ధాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. పై మూడు సంస్థల అధినేతలు హఫీజ్‌ సయీద్‌, సయ్యద్‌ సలాహుద్దీన్‌, మసూద్‌ల ఆధ్వర్యంలో శిక్షణ నడుస్తోంది. ఈ ముగ్గురూ ఎన్‌ఐఏ మోస్ట్‌-వాంటెడ్‌ జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే.

Updated Date - Oct 26 , 2024 | 03:02 AM