ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NHRC: బద్లాపూర్ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం.. మహారాష్ట్ర సీఎస్‌, డీజీపీకి నోటీస్

ABN, Publish Date - Aug 21 , 2024 | 08:04 AM

మహారాష్ట్ర బద్లాపూర్‌లోని పాఠశాల వాష్‌రూమ్‌లో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మహారాష్ట్ర మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు ఈ ఘటనపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Badlapur incident

మహారాష్ట్ర(Maharashtra)లోని బద్లాపూర్‌(Badlapur)లో ఇద్దరు మైనర్‌ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC) సుమోటోగా విచారణ చేపట్టింది. రెండు వారాల్లోగా సంబంధిత అధికారుల నుంచి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ కోరింది. ఈ క్రమంలో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడంలో జాప్యానికి గల కారణం, దాని పరిస్థితి, బాధిత బాలికల ఆరోగ్యం తదితర అంశాలను సమగ్ర నివేదికలో పొందుపరచాలని కమిషన్‌ ఆదేశించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 18న ఇద్దరు మైనర్ విద్యార్థినులపై ఓ పాఠశాల ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ మీడియా నివేదికను తామే స్వయంగా స్వీకరించామని తెలిపింది.


12 గంటల తర్వాత

బద్లాపూర్‌ పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు మహిళా ఉద్యోగిని ఎందుకు నియమించలేదని తల్లిదండ్రులు ప్రశ్నించారు. అదే సమయంలో పోలీసులకు(police) ఫిర్యాదు చేసిన 12 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. మీడియా కథనం నిజమైతే అది మానవ హక్కుల ఉల్లంఘన అని, దానిపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. బాధితులకు అధికారులు లేదా పాఠశాల యాజమాన్యం ఏదైనా కౌన్సెలింగ్ ఇచ్చారా అని కూడా కమిషన్ తెలుసుకోవాలనుకుంటోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఏం ప్రతిపాదించారో కూడా నివేదికలో పేర్కొనాలని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెండు వారాల్లోగా అధికారుల నుంచి సమాధానం వచ్చే అవకాశం ఉంది.


ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ, సిట్‌ ఏర్పాటు

బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు(fast track court)లో విచారించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం తెలిపారు. మరోవైపు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆర్తి సింగ్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి, ఉజ్వల్‌ నికమ్‌ను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రకటించారు.


బద్లాపూర్‌లో ఏం జరిగింది?

బద్లాపూర్(Badlapur) ఈస్ట్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు మైనర్ బాలికలను అందులో పనిచేసే టాయిలెట్ క్లినర్ లైంగికంగా వేధించినట్లు వెలుగులోకి వచ్చింది. స్కూల్ టాయిలెట్లను శుభ్రం చేసే అక్షయ్ షిండే అనే వ్యక్తి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. బాధితుల్లో ఒకరికి నాలుగేళ్లు, మరొకరికి ఆరేళ్లు. ఈ ఘటన ఆగస్టు 12, 13 తేదీల్లో జరిగింది.

కాంట్రాక్ట్

నిందితుడు అక్షయ్ షిండేను ఆగస్టు 1, 2024న పాఠశాలలో మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించారు. బాలికల మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు పాఠశాలలో మహిళా సిబ్బందిని నియమించలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న నిందితుడు ఆగస్టు 12, 13 తేదీల్లో తరగతుల సమయంలో పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది వెలుగులోకి రావడంతో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.


ఇవి కూడా చదవండి:

Bharat Bandh: నేడు భారత్ బంద్.. సూళ్లు, బ్యాంకులు తెరిచే ఉంటాయా..

CV Ananda Bose : బెంగాల్లో అనిశ్చితి

ఎంపాక్స్‌ చికిత్సకు మార్గదర్శకాలు


Read More National News and Latest Telugu News

Updated Date - Aug 21 , 2024 | 08:09 AM

Advertising
Advertising
<