ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NIA: బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి

ABN, Publish Date - Oct 04 , 2024 | 09:50 AM

లైసెన్స్ లేని ఆయుధాలు నిల్వ చేశారని బెదిరించి లంచం డిమాండ్ చేసిన కేసులో ఎన్ఐఏ అధికారిని సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

పట్నా: లైసెన్స్ లేని ఆయుధాలు నిల్వ చేశారని బెదిరించి లంచం డిమాండ్ చేసిన కేసులో ఎన్ఐఏ అధికారిని సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాజధాని పట్నాలో ఎన్ఐఏ యూనిట్‌లో డీఎస్పీగా పని చేస్తున్న అజయ్ ప్రతాప్‌సింగ్.. లైసెన్స్ లేని ఆయుధాలు సరఫరా చేస్తున్నారని చెప్పి ఓ కుటుంబం నుంచి రూ.2.5 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. ఈ అంశంపై బాధితుడు రాకీ యాదవ్ సీబీఐకి ఫిర్యాదు చేశాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సెప్టెంబరు 19 న అజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించింది.సెప్టెంబర్ 26న విచారణ అధికారి ముందు హాజరుకావాలని సింగ్‌ను కోరినట్లు అధికారులు తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ నుంచి డిప్యుటేషన్‌పై ఎన్‌ఐఏ పని చేస్తున్న సింగ్.. యాదవ్‌ను ఆయన కుటుంబాన్ని బెదిరించి రూ.2.5 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.


బెదిరింపుల నుంచి తనను, తన కుటుంబాన్ని రక్షించాలనే యాదవ్ ఎన్ఐఏను ఆశ్రయించారు. సెప్టెంబర్ 26న బాధితుడి నుంచి సింగ్.. రూ. 25 లక్షలు ముట్టచెప్పాలని డిమాండ్ చేశాడు. మధ్యవర్తిగా ఉన్న మరొకరి మొబైల్ సాయంతో చెల్లించాల్సిన డబ్బులు, వివరాలను మెసేజ్ రూపంలో పంపాడు. డబ్బులు సమకూర్చాక అదే నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని చెప్పాడు. అలా రూ.25 లక్షలు ఔరంగాబాద్‌కు చెందిన ఓ మధ్యవర్తికి అందాయి. అక్టోబర్ 1న యాదవ్‌ను సింగ్ మళ్లీ పిలిపించాడు. అదే రోజు మిగతా రూ.70 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు సింగ్. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను రెడ్‌హ్యాండెడ్గా పట్టుకున్నామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.


దొరికాడిలా..

బాధితుడి ఫిర్యాదు అందుకున్న తరువాత సీబీఐ, ఎన్‌ఐఏ సహకారంతో సింగ్‌కు ఉచ్చు బిగించింది. డీఎస్పీ అజయ్ ప్రతాప్ సింగ్, అతని ఇద్దరు ఏజెంట్లను సీబీఐ అరెస్టు చేసిందని ఎన్ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇద్దరు మధ్యవర్తులు హిమాన్షు, రితిక్ కుమార్ సింగ్‌లను కూడా సీబీఐ అరెస్టు చేసింది. గయా, పట్నా, వారణాసిలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు నిందితుల నుంచి రూ.20 లక్షలు రికవరీ చేసినట్లు చెప్పింది.

Pawan Kalyan : సనాతన ధర్మంపై దాడిని సహించం!

For Latest news and National news click here

Updated Date - Oct 04 , 2024 | 09:50 AM