మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Electoral bonds: నిధులుంటేనే పార్టీల మనుగడ...ఎలక్టోరల్ బాండ్స్‌పై గడ్కరి వాదన

ABN, Publish Date - Mar 23 , 2024 | 03:53 PM

ఎలక్టోరల్ బాండ్స్‌ స్కీమ్‌ను ఒక ''మంచి ఉద్దేశం''తోనే 2017లో కేంద్ర ప్రవేశ ప్రవేశపెట్టినట్టు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. నిధులు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదని చెప్పారు. ఈ స్కీమ్ చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది.

Electoral bonds: నిధులుంటేనే పార్టీల మనుగడ...ఎలక్టోరల్ బాండ్స్‌పై గడ్కరి వాదన

అహ్మదాబాద్: ఎలక్టోరల్ బాండ్స్‌ స్కీమ్ (Electoral bonds Scheme)ను ఒక ''మంచి ఉద్దేశం''తోనే 2017లో కేంద్ర ప్రవేశ ప్రవేశపెట్టినట్టు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) అన్నారు. నిధులు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదని చెప్పారు. ఈ స్కీమ్ చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. గాంధీనగర్‌ సమీపంలోని గిఫ్ట్ సిటీలో మీడియా హౌస్‌ నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరి మాట్లాడుతూ, ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తదుపరి ఆదేశాలు ఇచ్చినా అన్ని రాజకీయాల పార్టీలు కలిసి కూర్చుకుని దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.


''అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలక్టోరల్ బాండ్స్‌కు సంబంధించిన చర్చలో నేను పాల్గొన్నాను. వనరులు లేకుండా ఏపార్టీ కూడా మనుగడ సాగించలేదు. కొన్ని దేశాల్లో రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలే నిధులు ఇస్తాయి. ఇండియాలో అలాంటి సిస్టమ్ లేదు. అందువల్ల రాజకీయ పార్టీలకు ఆర్థిక వనరుల కోసం ఈ సిస్టం (ఎలక్టోరల్ బాండ్స్) తెచ్చాం'' అని గడ్కరి తెలిపారు.


రాజకీయ పార్టీలకు నేరుగా నిధులు అందాలన్నదే ఎలక్టోరల్ బాండ్స్ ప్రధాన ఉద్దేశమని, అధికార మార్పిడి జరిగితే సమస్యలు తలెత్తకుండా ఉండేందుతే విరాళాలు ఇచ్చిన వారి పేర్లు వెల్లడించడం లేదని అన్నారు. ఏదైనా మీడియా హౌస్ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే అందుకు స్పాన్సరర్ అవసరమవుతారని, అలాగే రాజకీయ పార్టీలు కూడా తమ కార్యకలాపాలు కొనసాగించాలంటే నిధులు అవసరమవుతాయని ఆయన పోలిక తెచ్చారు. నిధులు లేకుండా పార్టీలు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తాయనే వాస్తవ విషయాన్ని గ్రహించాలన్నారు. అందుకోసమే పారదర్శకమైన ఎలక్టోరల్స్ బాండ్స్ స్కీమ్ తెచ్చామని అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చినప్పుడు తమ ఉద్దేశం మంచిదేనని వివరించారు. సుప్రీంకోర్టుకు ఏదైనా లోటుపాట్లు కనిపిస్తే వాటిని సవరించమని తమను కోరవచ్చని, దానిపై అన్ని పార్టీలతో కలిసికట్టుగా చర్చిస్తామని గడ్కరి అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 03:53 PM

Advertising
Advertising