PK On Nitish: హవ్వా.. నితీష్ అలా చేస్తారా..? ప్రశాంత్ కిశోర్ ఆగ్రహం
ABN, Publish Date - Jun 15 , 2024 | 03:03 PM
బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం కోసం నితీష్ కుమార్ ఏం చేసేందుకు అయినా వెనకాడారని మండిపడ్డారు. ప్రధాని మోదీ కాళ్లకు నమస్కారం చేసేందుకు నితీష్ కుమార్ ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఘటన జరిగిన సంగతి తెలిసిందే. నితీష్ కుమార్‌కు అధికారం, వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం.. అందుకోసం ఆయన ఏం చేయాలని కోరినా సరే చేస్తారని మండిపడ్డారు.
భాగల్‌పూర్: బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం కోసం నితీష్ కుమార్ ఏం చేసేందుకు అయినా వెనకాడారని మండిపడ్డారు. ప్రధాని మోదీ కాళ్లకు నమస్కారం చేసేందుకు నితీష్ కుమార్ ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఘటన జరిగిన సంగతి తెలిసిందే. నితీష్ కుమార్‌కు అధికారం, వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం.. అందుకోసం ఆయన ఏం చేయాలని కోరినా సరే చేస్తారని మండిపడ్డారు. నితీశ్ అలా చేసి రాష్ట్రానికి మచ్చ తీసుకొచ్చారని భాగల్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రశాంత్ కిశోర్ విమర్శించారు.
తగ్గిన బీజేపీ మెజార్టీ
‘లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ తగ్గింది. అధికారం చేపట్టేందుకు మిత్రపక్షాల మీద ఆధార పడింది. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీకి 16 ఎంపీ సీట్లు, జేడీయూ 12 ఎంపీ సీట్లు గెలిచాయి. ఈ రెండు పార్టీలు మోదీకి చాలా అవసరం. ఎంపీ స్థానాలతో బలంగా ఉన్న నితీశ్ కుమార్, మోదీ కాళ్లకు నమస్కారం పెట్టడం ఏమిటో అర్థం కావడం లేదు. నితీష్ కుమార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటు పడటం లేదు. అధికారంలో కొనసాగడమే ముఖ్యమని భావిస్తారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్‌కు బీజేపీ మద్దతు అవసరం. ప్రధాని మోదీ కాళ్లకు దండం పెట్టేందుకు వెనకాడటం లేదు అని’ ప్రశాంత్ కిశోర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Bangalore: సీఎం కావాలంటే ఎమ్మెల్యేల మద్దతు ఉండాలిగా..
ఫస్ట్ బీజేపీ
ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహ కర్తగా తొలిసారి బీజేపీకి పనిచేసిన సంగతి తెలిసిందే. 2014లో బీజేపీ అధికారంలోకి తీసుకురావడంలో పీకే కృషి చేశారు. సోషల్ మీడియా ద్వారా మోదీకి హైప్ తీసుకొచ్చారు. ఆ తర్వాత కేంద్రంలో మోదీకి తిరుగులేకుండా పోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. ఆ సమయంలో వర్కవుట్ కాలేదు. బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, ఏపీలో జగన్ మోహన్ రెడ్డికి పీకే పనిచేశారు.
Bangalore: సీఎం కావాలంటే ఎమ్మెల్యేల మద్దతు ఉండాలిగా..
Updated Date - Jun 15 , 2024 | 03:03 PM