ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: బీజేపీకి ఊహించని షాక్.. ఇక మద్దతు ఇచ్చేదే లేదంటూ బీజేడీ సంచలన ప్రకటన

ABN, Publish Date - Jun 24 , 2024 | 05:23 PM

గతంలో బీజేపీ, ఒడిశాలోని బీజేడీ పార్టీలు సహజీవనం చేశాయి. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. బీజేడీతో సంబంధాలు తెంపుకొని.. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే రంగంలోకి..

BJP vs BJD

గతంలో బీజేపీ (BJP), ఒడిశాలోని బీజేడీ (BJD) పార్టీలు సహజీవనం చేశాయి. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. బీజేడీతో సంబంధాలు తెంపుకొని.. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే రంగంలోకి దిగింది. సుదీర్ఘకాలం నుంచి సీఎంగా కొనసాగించిన నవీన్ పట్నాయక్‌కు (Naveen Patnaik) బ్రేకులు వేసి.. ఆ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే.. నవీన్ పట్నాయక్ తన రాజ్యసభ ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జూన్ 27వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు (Parliament Sessions) ప్రారంభం కానున్న తరుణంలో.. బీజేపీకి మద్దతు ఇవ్వొద్దని, రాజ్యసభలో బలమైన ప్రతిపక్షంగా ఎదగాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను తగిన రీతిలో లేవనెత్తాలని చెప్పారు. జూన్ 24న తన రాజ్యసభ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో నవీన్ పట్నాయక్ ఈమేరకు దిశానిర్దేశం చేశారు.


ఈ సమావేశం అనంతరం బీజేడీ రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్రా (Sasmit Patra) మాట్లాడుతూ.. బీజేడీ ఎంపీలు ఈసారి కేవలం రాష్ట్ర సమస్యలపై మాట్లాడటమే కాదు, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒడిశా ప్రయోజనాలని విస్మరిస్తే ఆందోళనకు దిగాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో పాటు పేలవమైన మొబైల్ కనెక్టివిటీ, మితంగా ఉన్న బ్యాంకు శాఖల సమస్యల్ని కూడా లేవనెత్తుతారని అన్నారు. బొగ్గు రాయల్టీని సవరించాలన్న ఒడిశా డిమాండ్‌ను గత 10 ఏళ్లుగా కేంద్రం విస్మరించిందని.. దీని వల్ల రాష్ట్ర ప్రజలకు సరైన వాటా దక్కకుండా పోతోందని చెప్పారు. ఇకపై తాము బీజేపీకి మద్దతు ఇవ్వమని.. ప్రతిపక్షంగానే కొనసాగుతామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తామన్నారు. ఒడిశా డిమాండ్లను ఎన్డీఏ ప్రభుత్వం విస్మరిస్తే.. బలమైన, శక్తివంతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని తమ అధ్యక్షుడు కోరారని పేర్కొన్నారు.


ఇదిలావుండగా.. రాజ్యసభలో బీజేడీ తొమ్మిది ఎంపీలను కలిగి ఉంది. అయితే.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటుని కూడా గెలుచుకోలేకపోయింది. 1997లో ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పార్టీకి ఇలాంటి పరాభావం ఎదురుకావడం ఇదే మొదటిసారి. అంతేకాదు.. 24 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో బీజేడీ అధకారాన్నీ కోల్పోయింది. కొన్ని సంవత్సరాల నుంచి వివిధ సమస్యలపై పార్లమెంటులో బీజేపీకి బీజేడీ మద్దతు ఇస్తూ వచ్చింది. 2019, 2024లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాజ్యసభకు ఎన్నిక కావడానికి కూడా సహాయపడింది. కానీ.. ఇప్పుడు అలాంటి మద్దతు ఉండదని బీజేడీ తేల్చి చెప్పేసింది.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 24 , 2024 | 05:23 PM

Advertising
Advertising