BRICS Summit: టెర్రర్ ఫండింగ్‌పై ద్వంద్వ ప్రమాణాలు.. చైనాకు మోదీ చురకలు
ABN, Publish Date - Oct 23 , 2024 | 05:10 PM
ఉగ్రవాదం, ఉగ్రవాదులకు నిధుల సరఫరా అనేవి చాలా తీవ్రమైన సమస్యలు. వీటిని చాలా సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ఇందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలనిని మోదీ సూచించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర నేరుగా ఏ దేశం పేరును ప్రస్తావించకపోయినప్పటికీ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌కు చైనా ఆర్థిక సహాయాన్ని ఎండగట్టారు.
కజాన్: ఉగ్రవాదంపై పోరుకు యావత్ ప్రపంచం ఏకతాటిపై నిలవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పిలుపునిచ్చారు. దీనిపై ద్వంద్వ ప్రమాణాలకు తావీయరాదని పరోక్షంగా చైనా తీరును ఎండగట్టారు. కజాన్‌లో జరుగుతున్న 16వ బ్రిక్స్ సదస్సు (BRICS Summit) ముగింపు సమావేశంలో మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం అనే తీవ్ర సమస్యను కలిసికట్టుగానే ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ఇలాంటి అంశాల్లో ద్వంద్వ ప్రమాణాలు సరికాదన్నారు.
WHO: 77 శాతం చిన్నారులకు పౌష్టికాహారం దూరమే
''ఉగ్రవాదం, ఉగ్రవాదులకు నిధుల సరఫరా అనేవి చాలా తీవ్రమైన సమస్యలు. వీటిని చాలా సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ఇందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలి" అని మోదీ సూచించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర నేరుగా ఏ దేశం పేరును ప్రస్తావించకపోయినప్పటికీ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌కు చైనా ఆర్థిక సహాయాన్ని ఎండగట్టారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే రాడికలైజేషన్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. యువతను అతివాదులుగా మారేందుకు ప్రేరేపించడాన్ని (రాడికలైజేషన్) సమష్టిగా ప్రపంచదేశాలు అడ్డుకోవాలని అన్నారు. అంతర్జాతీయ తీవ్రవాదంపై యూఎన్ కాంప్రహెన్సివ్ కన్వెన్షన్‌లో ప్రస్తావించిన పెండింగ్ అంశాలపై కూడా అంతా కలిసికట్టుగా పనిచేయాలని సభ్యదేశాలకు మోదీ పిలుపునిచ్చారు.
సైబార్ సెక్యూరిటీ అనేది కీలకమని, సైబర్ సెక్యూరిటీ, సేఫ్, సెక్యూర్ ఏఐపై అంతర్జాతీయ రెగ్యులేషన్సపై సభ్యదేశాలు కలిసకట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, డబ్ల్యూటీఓ వంటి గ్లోబల్ సంస్థల్లో కూడా ఎప్పటికప్పుడు సంస్కరణలు తెచ్చేందుకు ముందుకు రావాలని సూచించారు. చర్చలు, దౌత్యానికి భారత్ బాసటగా నిలుస్తుందని, యుద్ధానికి కాదని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, ఆహారం, నీరు, ఇంధనం, ఆరోగ్యం వంటి అంశాలు అన్ని దేశాలకు ప్రాధాన్యతాంశాలని అన్నారు. 'బ్రిక్స్' అంటే విభజన గ్రూప్ కాదని, పబ్లిక్ ఇంట్రస్ట్ గ్రూప్ అనే స్పష్టమైన సందేశాన్ని ప్రపంచ దేశాలకు మనం ఇవ్వాలని అన్నారు.
కొత్త దేశాలకు స్వాగతం
బ్రిక్స్ భాగస్వా్య దేశంగా కొత్త కొత్తదేశాలకు స్వాగతం పలికేందుకు ఇండియా సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు. అయితే ఇందుకు సంబంధించిన నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బ్రిక్స్ వ్యవస్థాపక దేశాల అభిప్రాయాలను గౌరవించాల్సి ఉంటుందన్నారు. జోహెన్సెస్‌బర్గ్ సమ్మిట్‌లో అంగీకరించిన సిద్ధాంతాలు, ప్రమాణాలు, క్రైటీరియా, ప్రొసీజర్‌ను తూచ తప్పకుండా సభ్యదేశాలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
ఇవి కూడా చదవండి..
Priyanka Gandhi: మీలో సొంత కుటుంబ సభ్యులను చూస్తున్నా.. వయనాడ్ సభలో ప్రియాంక ఎమోషనల్..
Priyanka Gandhi: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ.. వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్..
Read More National News and Latest Telugu News
Updated Date - Oct 23 , 2024 | 05:16 PM