ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Results: చంద్రబాబు, నితీష్‌తో మంతనాలు... పవార్ ఏమన్నారంటే?

ABN, Publish Date - Jun 04 , 2024 | 05:23 PM

'ఇండియా' కూటమి నేతగా ఉన్న ఎన్‌సీపీ-ఎస్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ఇప్పటికే జేడీయూ నేత నితీష్ కుమార్, టీడీపీ చీఫ్ ఎన్.చంద్రబాబునాయుడుతో మాట్లాడారంటూ ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. అయితే, ఈ ఊహాగానాలను మంగళవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో శరద్‌పవార్ కొట్టివేశారు.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా మెజారిటీకి చేరువ కాకపోవడం, కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి సీట్లు గణనీయంగా పెరగడంతో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. 'ఇండియా' కూటమి నేతగా ఉన్న ఎన్‌సీపీ-ఎస్‌సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) ఇప్పటికే జేడీయూ నేత నితీష్ కుమార్ (Nitish Kumar), టీడీపీ చీఫ్ ఎన్.చంద్రబాబునాయుడు (N.Chandrababu Naidu) తో మాట్లాడారంటూ ఊహాగానాలు సైతం ఊపందుకుంటున్నాయి. అయితే, ఈ ఊహాగానాలను మంగళవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో శరద్‌పవార్ కొట్టివేశారు. ఇంతవరకూ తానెవరితోనూ మాట్లాడలేదని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై 'ఇండియా' కూటమి నేతలు ఢిల్లీలో బుధవారంనాడు సమావేశం కావచ్చునని చెప్పారు. దీనిపై మల్లికార్జున్ ఖర్గే, సీతారాం ఏచూరితో మాట్లాడానని, కూటమి సమావేశంపై ఈరోజు సాయంత్రంలోగా తుది నిర్ణయం ఉంటుందని, అందుకు అనుగుణంగా తాను ఢిల్లీలో ఉంటానని చెప్పారు.

Lok sabha Elections 2024: ఎన్డీయేకు భారీగా తగ్గుతున్న మెజారిటీ.. చంద్రబాబు, నితీష్ కుమార్ కీలకం!


తదుపరి ప్రధానమంత్రిపై..

తదుపరి ప్రధానమంత్రి ఎవరు కావచ్చనే ప్రశ్నకు పవార్ సమాధానమిస్తూ, 'ఇండియా' కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అనేది తానింకా కచ్చితంగా చెప్పలేనని, బుధవారంనాటి సమావేశంలో దీనిపై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ, 'ఇండియా' కూటమికి యూపీ ఎన్నికలు కొత్త దిశానిర్దేశం చేశాయని, గత ఎన్నికలతో పోల్చుకుంటూ బీజేపీ గెలిచిన చోట్లలో కూడా మార్జిన్ చాలా తక్కువగా ఉందని అన్నారు. ఎన్‌‌సీపీ-ఎస్‌సీపీ పనితీరుపై కూడా ఆయన సంతృప్తి వ్యక్తం చేసారు. 10 సీట్లలో తాము పోటీ చేసి 7 సీట్లలో ఆధిక్యంలో ఉన్నామని చెప్పారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 05:23 PM

Advertising
Advertising