ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Champai Soren: చర్చలు జరగలేదు: బాబులాల్ మారండి

ABN, Publish Date - Aug 19 , 2024 | 05:03 PM

జేఏంఎంలో సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ కాక రేపారు. తనకు అవమానం జరిగిందని, సీఎల్పీ సమావేశం గురించి తెలియదని, సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరడంతో షాక్ తిన్నానని సోరెన వివరించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందే పార్టీ మారతానని హింట్ ఇచ్చారు. ఏ పార్టీ, ఎప్పుడు చెరతారనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. బీజేపీలో చేరతారనే ఊహాగానాలు మాత్రం జోరందుకున్నాయి.

Babulal Marandi

ఢిల్లీ: జేఏంఎంలో సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ (Champai Soren) కాక రేపారు. తనకు అవమానం జరిగిందని, సీఎల్పీ సమావేశం గురించి తెలియదని, సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరడంతో షాక్ తిన్నానని సోరెన వివరించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందే పార్టీ మారతానని హింట్ ఇచ్చారు. ఏ పార్టీ, ఎప్పుడు చెరతారనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. బీజేపీలో చేరతారనే ఊహాగానాలు మాత్రం జోరందుకున్నాయి.



బీజేపీలో చేరతారా..?

చంపై సోరెన్ జార్ఖండ్ నుంచి ఢిల్లీ రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. నేడో, రేపే పార్టీ మారతారాని జోరుగా ప్రచారం జరిగింది. వ్యక్తిగత కారణాలతో ఢిల్లీ వచ్చానని సోరెన్ వివరించారు. ఇదే అంశంపై జార్ఖండ్ బీజేపీ చీఫ్ బాబులాల్ మారండిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. చంపై సోరెన్ బీజేపీలో చేరతారా..? ఎప్పుడు చేరతారని అడిగారు.



ఆయనే ప్రకటిస్తారు..

‘చంపై సోరెన్ బీజేపీలో చేరే అంశానికి సంబంధించి ఇప్పటి వరకు చర్చ జరగలేదు. చంపై సోరెన్ అనుభవం ఉన్న నేత, నిర్ణయాన్ని ఆయన ప్రకటిస్తారు. ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం పోరాడిన వారిలో చంపై సోరెన్ ఒకరు. సోషల్ మీడియాలో చంపై సోరెన్ చేసిన పోస్ట్ చూసి బాధ కలిగింది. పార్టీలో జరిగిన అవమానంతో తీవ్రంగా బాధ పడ్డారు. సీఎం పదవి నుంచి తొలగించిన విధానం బాధ కలిగించింది. అందుకే పార్టీతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అని’ బాబులాల్ మారండి అభిప్రాయ పడ్డారు.


Also Read:
Kolkata Doctor: ఆధారాలు దొరకొద్దనే ధ్వంసం చేశారు..!

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 19 , 2024 | 05:03 PM

Advertising
Advertising
<