ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: ఎన్టీఏ లోపాల వల్లే లీకేజీ..!!

ABN, Publish Date - Aug 02 , 2024 | 12:14 PM

నీట్ యూజీ పరీక్ష లీకేపీ ముగ్గురు సభ్యులు గల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదని గత నెలలో తీర్పునిచ్చింది. అందుకు గల కారణాలను ఈ రోజు వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపాల వల్ల లీకేజీ జరిగిందని ధర్మాసనం అభిప్రాయ పడింది.

Supreme Court

ఢిల్లీ: నీట్ యూజీ (Neet UG) పరీక్ష లీకేపీ ముగ్గురు సభ్యులు గల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదని గత నెలలో తీర్పునిచ్చింది. అందుకు గల కారణాలను ఈ రోజు వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపాల వల్ల లీకేజీ జరిగిందని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది. నీట్ యూజీసీ పరీక్ష రద్దు యాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.


వ్యవస్థీకృత ఉల్లంఘన జరగలే..!!

నీట్ పేపర్ లీకేజీలో ఎలాంటి వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదు. పరీక్ష పవిత్రతను దెబ్బతీసే స్థాయిలో లీకేజీ జరగలేదు. పేపర్ లీకేజీ ఝార్ఖండ్‌లో గల హజారీబాగ్, బీహార్‌ పాట్నా కేంద్రాల్లో మాత్రమే జరిగింది. ఘటనపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందుకోసమే పరీక్ష రద్దు చేయాలని అనుకోవడం లేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు పునరావృతం కారాదని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.


నివేదిక అందజేయండి..

పరీక్షల్లో సంస్కరణల కోసం నియమించిన ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్యానెల్‌ను మరింత విస్తరించాలని కోరింది. పరీక్ష విధానంలో లోపాలను చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలపై సెప్టెంబర్ 30వ తేదీతో లోగా నివేదిక అందజేయాలని తేల్చి చెప్పింది. నివేదిక అందజేసిన తర్వాత అందులో అమలు చేసే అంశాలపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.


23 లక్షల మంది విద్యార్థులు

మే 5వ తేదీన వైద్య విద్యలో ప్రవేశం కోసం నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు. దేశంలో గల 571 నగరాల్లో 4750 సెంటర్లలో పరీక్ష జరిగింది. 23 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. పేపర్ లీక్ ఘటనతో పరీక్ష రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిల్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి ఈ రోజు తుది తీర్పు ఇచ్చింది.

Updated Date - Aug 02 , 2024 | 12:26 PM

Advertising
Advertising
<