ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Odisha : యువతి తలలో 70 సూదులు గుచ్చేశాడు

ABN, Publish Date - Jul 20 , 2024 | 03:58 AM

నారోగ్యాన్ని నయం చేస్తానని నమ్మబలికిన ఓ తాంత్రికుడు.. 19 ఏళ్ల యువతి ప్రాణాలతో చెలగాటమాడాడు. వైద్యం పేరిట ఆ యువతి తలలో ఏకంగా 70 సూదులు గుచ్చేశాడు.

  • వైద్యం పేరిట ఒడిసాలో ఓ తాంత్రికుడి పిచ్చిపని

సంబల్‌పూర్‌, జూలై 19: అనారోగ్యాన్ని నయం చేస్తానని నమ్మబలికిన ఓ తాంత్రికుడు.. 19 ఏళ్ల యువతి ప్రాణాలతో చెలగాటమాడాడు. వైద్యం పేరిట ఆ యువతి తలలో ఏకంగా 70 సూదులు గుచ్చేశాడు. ఒడిసాలోని బలాంగిర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన సదరు యువతి ఆస్పత్రిలో చేరడంతో బయటికొచ్చింది. సకాలంలో వైద్యం అందించిన వైద్యులు ఆ సూదులను బయటికి తీయడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. బాధిత యువతి కుటుంబసభ్యుల కథనం ప్రకారం...

బలాంగిర్‌ జిల్లాకు చెందిన బిష్ణు బెహరా కుమార్తె రేష్మ బెహరా(19) నాలుగేళ్లుగా అంతుచిక్కని అనారోగ్యంతో బాధపడుతోంది. ఎందరు వైద్యులను సంప్రదించి చికిత్స చేయించినా రేష్మ ఆరోగ్యంలో మార్పు కనిపించలేదు. దీంతో ఆ కుటుంబం సంతోష్‌ రాణా అనే తాంత్రికుడిని ఆశ్రయించింది. వారి సమస్య విన్న సంతోష్‌ రాణా అనారోగ్యాన్ని నయం చేస్తానని నమ్మించాడు.

తల్లిదండ్రులను బయటే ఉంచే రేష్మను ఓ గదిలోకి తీసుకెళ్లాడు. గంట సేపటి తర్వాత తలుపులు తీసి యువతికి నయమైందని ఇంటికి తీసుకెళ్లవచ్చని చెప్పాడు. కాసేపటికి రేష్మ చాలా ఇబ్బంది పడుతుండగా చూసిన తల్లిదండ్రులు ఆమె తలలో సూదులు ఉండడాన్ని చూసి అవాక్కయ్యారు. వెంటనే రేష్మను సమీపంలో ఆస్పత్రికి తరలించారు. సీటీ స్కాన్‌ చేసిన వైద్యులు రేష్మ తలలో పెద్ద సంఖ్యలో సూదులు ఉన్నట్టు గుర్తించారు. రేష్మకు గురువారం రాత్రి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు గంటన్నర సేపు శ్రమించి ఆమె తలలో నుంచి 70 సూదులను బయటికి తీశారు.

Updated Date - Jul 20 , 2024 | 03:58 AM

Advertising
Advertising
<