Odisha: మహిళా ఉద్యోగులకు అదనపు సెలవులు.. ముఖ్యమంత్రి కీలక నిర్ణయం
ABN, Publish Date - Mar 12 , 2024 | 07:51 PM
నేటి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంసార జీవితం సాఫీగా సాగుతుంది. అయితే.. మగవారితో పోలిస్తే ఉద్యోగాలు చేసే ఆడవారు కాస్త ఎక్కువగా శ్రమిస్తుంటారు.
నేటి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంసార జీవితం సాఫీగా సాగుతుంది. అయితే.. మగవారితో పోలిస్తే ఉద్యోగాలు చేసే ఆడవారు కాస్త ఎక్కువగా శ్రమిస్తుంటారు. ఆఫీస్ పనులతో పాటు ఇంటి పని, బాధ్యతలు అన్నీ వారికే. అప్పడుప్పుడు మగవాళ్లు సహాయం చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో కష్టపడేది మాత్రం ఆడవారే. ఇంటిపనులు చేస్తూ ఉద్యోగాలు చేసే వారి కోసం ఒడిశా ( Odisha ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు వారు పొందుతున్న 15 రోజుల పాటు అదనంగా 10 రోజుల క్యాజువల్ లీవ్‌ను ఇవ్వాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇంటి బాధ్యతలు, ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకుంది ఈ ప్రకటన చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
గత వారమే రాష్ట్ర ప్రభుత్వం మహిళా బ్లాక్ గ్రాంట్ ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ప్రకటించింది. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల కోసం రాష్ట్ర-నిర్దిష్ట పథకం మమత కింద ప్రసూతి ప్రయోజనాన్ని ₹ 5,000 నుంచి ₹ 10,000కు పెంచింది. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు 2011లో ప్రారంభించిన ఈ పథకం ఇప్పటివరకు 60 లక్షల మంది గర్భిణులు, బాలింతలకు ప్రయోజనం కలిగించింది.
బ్లాక్ స్థాయి, పంచాయతీ స్థాయి ఎస్‌హెచ్‌జీ సమాఖ్య మహిళా అధికారుల ప్రతి సమావేశానికి రోజువారీ భత్యాన్ని ₹ 500కి పెంచింది. సభ్యులు, నాయకత్వ స్థానాల్లో ఉన్న 150,000 ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఒక్కొక్కరికి ₹ 2,000 చొప్పున ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. 2019లో బిజూ స్వాస్థ్య కళ్యాణ్ యోజన, ఆరోగ్య బీమా పథకం ఉన్న కుటుంబాలలోని పురుషులకు ప్రైవేట్ ఆసుపత్రులలో ₹ 5 లక్షల వరకు చికిత్స అందిస్తుండగా మహిళలకు ₹10 లక్షల వరకు అందించనున్నారు.
వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటనలు చేస్తుండటం గమనార్హం. ఈ పథకాల ద్వారా అధికంగా లబ్ధి పొందేది మహిళలే. ఒడిశాలో పురుషుల కంటే 2000లో 54% ఉన్న మహిళల ఓటింగ్ శాతం 2019లో 74%కి పెరిగింది. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన తొలి రాష్ట్రం ఒడిశా కావడం విశేషం.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 12 , 2024 | 07:51 PM