Om Birla: స్పీకర్ ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా గురించి ఆసక్తికర విషయాలు
ABN, Publish Date - Jun 25 , 2024 | 01:29 PM
దేశ చరిత్రలో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ పదవికి పోటీ జరగబోతోంది. అధికార ఎన్డీయే తరఫున మరోసారి ఓం బిర్లా బరిలో నిలవగా.. విపక్ష ఇండియా కూటమి సైతం కేరళకు చెందిన కొడికున్నిల్ సురేష్‌ను పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీ: దేశ చరిత్రలో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ పదవికి పోటీ జరగబోతోంది. అధికార ఎన్డీయే తరఫున మరోసారి ఓం బిర్లా బరిలో నిలవగా.. విపక్ష ఇండియా కూటమి సైతం కేరళకు చెందిన కొడికున్నిల్ సురేష్‌ను పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ఆయన కూడా స్పీకర్ పదవికి నామినేషన్ వేశారు. సభలో ఎన్డీయేకు అత్యధిక సంఖ్యలో ఎంపీలు ఉండటంతో ఈ ఎన్నికల దాదాపు ఏకపక్షంగానే జరగనుంది. అంటే మళ్లీ ఓం బిర్లానే స్పీకర్‌గా చూడబోతున్నామనమాట. ఓం బిర్లాకు(OM Birla) సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
ఓం బిర్లా1962 నవంబర్ 23న కోటాలో జన్మించారు. ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు.
1991లో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా 1997లో నియమితులయ్యారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తొలిసారిగా 2003లో కోటా సౌత్ స్థానం నుంచి గెలిచి రాజస్థాన్ శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహించారు.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని కోటా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అక్కడ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన ప్రహ్లాద్ గుంజాల్‌పై 41 వేల ఆధిక్యంతో గెలుపొందారు. గడిచిన 20 ఏళ్లలో లోక్ సభకు మరోసారి ఎన్నికైన నేతగా బిర్లా నిలిచారు.
ఓం బిర్లా 2014 నుంచి కోట లోక్ సభ స్థానాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. 2019లో లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
For Latest News and National News click here
Updated Date - Jun 25 , 2024 | 01:30 PM