ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Omar Abdullah: విడాకుల పిటిషన్‌పై మాజీ సీఎం భార్యకు నోటీసు

ABN, Publish Date - Jul 15 , 2024 | 04:35 PM

విడాకులు కోరుతూ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వేసిన పిటిషన్‌పై ఆయన భార్యకు సుప్రీంకోర్టు సోమవారంనాడు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా ఆమె సమాధానం ఇవ్వాలని న్యాయమూర్తులు సుధాన్షు ధులియా, అసనుద్దీన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

న్యూఢిల్లీ: విడాకులు కోరుతూ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) వేసిన పిటిషన్‌పై ఆయన భార్యకు సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా ఆమె సమాధానం ఇవ్వాలని న్యాయమూర్తులు సుధాన్షు ధులియా, అసనుద్దీన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.


పాయల్ అబ్దుల్లా తన పట్ల క్రూరత్వంతో వ్యవహరిస్తున్నందున తనకు విడాకులు మంజూరు చేయాలంటూ 2016లో ఒమర్ అబ్దుల్లా వేసిన పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చింది. ఒమర్ విజ్ఞప్తిలో ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేసింది. దీనిని ఒమర్ అబ్దుల్లా హైకోర్టులో సవాలు చేశారు. అయితే కుటుంబ న్యాయస్థానం వెలువరించిన ఆదేశాన్ని న్యాయమూర్తులు సంజీవ్ సచ్‌దేవ్, వికాస్ మహాజన్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం కూడా 2023లో సమర్ధించింది. తన వాదనను బలపరచేందుకు తగిన సాక్ష్యాలను ఆయన చూపించలేకపోయారని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలను తిరిగి సుప్రీంకోర్టులో ఒమర్ సవాలు చేశారు. కాగా, సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలు వినిపిస్తూ, గత 15 ఏళ్లుగా వారు విడివిడిగానే ఉంటున్నారని, వారి దాంపత్యబంధం దాదాపు ముగిసినట్టేనని అన్నారు. వీరి విషయంలో ఆర్టికల్ 142ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు.

DK Shivakumar: డీకేకు సుప్రీంకోర్టులో చుక్కెదురు


ఒమర్, పాయల్ అబ్దుల్లా 1994 సెప్టెంబర్ 1న వివాహం చేసుకున్నారు. 2009 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉండగా ఒకరు ఒమర్ సంరక్షణలో, మరొకరు పాయల్ సంరక్షణలో ఉంటున్నారు. ఇంతకుముందు హైకోర్టు సైతం ఒమర్‌ను తన ఇద్దరు కొడుకులకు నెలసరి 60,000 చొప్పున ఇవ్వడంతో పాటు నెలసరి మెయింటెనెన్స్‌గా పాయల్ అబ్దుల్లాకు రూ.1.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది.

For Latest News and National News click here

Updated Date - Jul 15 , 2024 | 04:35 PM

Advertising
Advertising
<