Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో అమిత్ షా పర్యటన
ABN, Publish Date - Dec 14 , 2024 | 01:02 PM
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మూడు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టులతో ఆయన సమావేశం కానున్నారు.
రాయ్‌పూర్, డిసెంబర్ 14: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. నేటి నుంచి అంటే శనివారం నుంచి మూడు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శాంతి భద్రతలపై ఆయన సమీక్షిస్తారు. అలాగే లోంగిపోయిన మావోయిస్టులు, స్థానికులు, మావోయిస్టుల కారణంగా బాధితులుగా మారిన కుటుంబాలతో అమిత్ షా సమావేశం కానున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు అమిత్ షా శనివారం చేరుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని భద్రతపై ఉన్నతాధికారులతో ఆయన కీలక సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే రాయ్‌పూర్ వేదికగా జరగనున్న కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులకు ప్రెసిడెంట్స్ కలర్ పురస్కారాన్ని అందజేయనున్నారు.
Also Read: అద్వానీకి మళ్లీ అనారోగ్యం.. ఆసుపత్రికి తరలింపు
అనంతరం జగదల్‌పూర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన లోంగిపోయిన మావోయిస్టులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశం కానున్నారు. అలాగే బస్తర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలలో పాల్గొనున్నారు. అదే విధంగా వామపక్ష తీవ్రవాదం వల్ల అమరులైన వారికి అమిత్ షా శ్రద్దాంజలి ఘటించనున్నారు.
Also Read: అల్లు అర్జున్ అరెస్ట్‌పై చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు
ఇక మావోయిస్టుల కారణంగా బాధితులుగా మారిన కుటుంబాలతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. అమిత్ షా పర్యటనలో భాగంగా భద్రత దళాలు ఏర్పాటు చేసిన శిబిరాలను సైతం ఆయన సందర్శించి.. పరిశీలించనున్నారు. అలాగే మావోయిస్టుల నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాల పురోగతిని సైతం ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ఆయన అడిగి తెలుసుకోనున్నారు.
Also Read: పోలీస్ వాహనంపై దాడి.. ప్రధాన నిందితుడిని ఎత్తుకెళ్లిన ముఠా
మరోవైపు డిసెంబర్ మొదటి వారాంతంలో ఛత్తీస్‌గఢ్ సీఎం ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని బస్తర్, కోడెగావ్ జిల్లాలో మావోయిస్టుల నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాలు ఏ విధంగా సఫలీకృతమయ్యాయో.. కేంద్ర మంత్రికి ఛత్తీస్‌గఢ్ సీఎం వివరించారు. అలాగే మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర బలగాల సమన్వయంతో ఛత్తీస్‌గడ్ పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాన్ని సైతం ఈ సందర్భంగా అమిత్ షాకు సీఎం వివరించారు.
Also Read: దుర్గమ్మను దర్శించుకొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్.. మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో మావోయిస్టుల కారణంగా గతంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకొనేవని.. కానీ నేడు ఆ పరిస్థితి అయితే లేదని వివరించారు. దీంతో రాష్ట్రంలో రహదారులు, పాఠశాలలు, ఆరోగ్య సంబంధ సౌకర్యాలను కల్పించడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల దృక్పదం ఏర్పాడిందని ఈ భేటీలో అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సోదాహరణగా వివరించారు. అదే విధంగా రాష్ట్రంలో నక్సల్స్ వల్ల బాధితుల కుటుంబాలకు పునరావాస చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను సైతం అమిత్ షాకు సీఎం వివరించారు.
Also Read: తాటిపండు (తాటికాయ) వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
2026, మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల నిర్మూలించేందుకు కేంద్రం కృత నిశ్చయంతో ఉంది. అందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఆ క్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది. కానీ ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సైతం మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం కంకణం కట్టుకొంది.
అందులోభాగంగా మావోయిస్టులను నిర్మూలించేందుకు భద్రతా దళాలు తరచూ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రత దళాలు, మావోయిస్టుల మధ్య పలుమార్లు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకొంటున్నాయి. దీంతో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగులుతోంది. ఇక మావోయిస్టులు సైతం ఇన్ ఫార్మర్ల నెపంతో పలువురిని హతమారుస్తున్నారు. దాంతో భద్రత దళాలు కూబింగ్ నిర్వహిస్తూ.. ముందుకు సాగుతోన్నాయి. ఇంకోవైపు కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఛత్తీగ్‌గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించిన విషయం విధితమే.
For National News And Telugu New
Updated Date - Dec 14 , 2024 | 01:07 PM