ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Aadhaar number:‘ఆధార్ నెంబర్‌’ తో బ్యాంక్ ఖాతాలో సొమ్ము మాయం

ABN, Publish Date - Jul 17 , 2024 | 02:54 PM

మీ భవిష్యత్తుకు ఆధార్ కార్డే కీలకమంటూ దేశ ప్రజలకు కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. దీంతో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు అంతా ఆధార్ కార్డు తీసుకున్నారు. తీసుకొంటున్నారు.

హైదరాబాద్, జులై 17: మీ భవిష్యత్తుకు ఆధార్ కార్డే కీలకమంటూ దేశ ప్రజలకు కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. దీంతో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు అంతా ఆధార్ కార్డు తీసుకున్నారు. తీసుకొంటున్నారు. ఆ ఆధార్ కార్డు.. అన్నింటికి లింక్ చేయమని ప్రభుత్వం నిబంధన విధించింది. దీంతో గ్యాస్, పాన్(PAN), బ్యాంక్ అకౌంట్ వగైరా వగైరా అన్నింటికి లింక్ చేయమని సూచించింది. దాంతో ఆ సూచనను అంతా తూ. చ తప్పకుండా పాటించారు.


ప్రస్తుతం సైబర్ నేరగాళ్లకు పెద్ద వరమైంది. అయితే గతంలో బ్యాంక్ అకౌంట్‌లో నగదు కాజేయడానికి ఖాతా దారులకు ఫోన్ చేయడం లేదా లింక్ పంపడం.. ఓటీపీ చెప్పమని అడగడం లాంటివి సైబర్ నేరగాళ్లు చేసే వారు. కానీ ప్రస్తుతం అవేమీ లేకుండా జస్ట్ ఆధార్ కార్డు సంఖ్య ఆధారంగా బ్యాంక్ అకౌంట్‌లోని నగదును సైబర్ కేటుగాళ్లు స్వాహా చేసేస్తున్నారు. దీంతో రోజురోజుకు మారుతున్న సాంకేతిక పద్దతులను సైబర్ నేరగాళ్లు అంది పుచ్చుకుంటున్నారనే విషయం సుస్పష్టమవుతుంది.


అదీకాక సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం కఠినమైన.. పట్టిష్టమైన చర్యలు తీసుకుంటుంది. అలాంటి వేళ.. బ్యాంక్ ఖాతాల్లోని నగదును ఆన్‌లైన్‌లో కాజేయడానికి సైబర్ నేరగాళ్లు నవీన పంథాను ఎంచుకున్నారు. అయితే ప్రజల సౌకరార్థం ప్రభుత్వం ఎఈపీఎస్ (AePS)కు అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల్లోని నగదును ఖాళీ చేస్తున్నారు.

Also Read: Maharashtra: అసెంబ్లీ ఎన్నికల వేళ.. అజిత్‌కి పెద్ద దెబ్బ


ఏఈపీఎస్ అంటే ఏమిటీ?

ఏఈపీఎస్ లేదా ఆధార్ కార్డు ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనేది వినియోగదారులు.. తమ బ్యాంక్ ఖాతా నుండి ఆధార్‌ని ఉపయోగించి డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతిస్తుంది. వినియోగదారులు.. తమ బ్యాంక్ ఖాతాలు ఆధార్ కార్డుతో లింక్ చేయబడి ఉంటే.. ఏఈపీఎస్ ద్వారా చెక్ బుక్ లేదా ఏటీఎం కార్డు లేకుండా నగదును సైతం విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ తరహా లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ పరిమితి విధించింది.


బ్యాంక్ ఖాతాదారుల సమాచారాన్ని సేకరించి.. వారి ఖాతాల్లోని నగదును ఏఈపీఎస్ ఉపయోగించి సైబర్ నేరగాళ్లు తస్కరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని భూమి కేటాయింపులకు సంబంధించిన కాగితాల్లోని ఫింగర్ ప్రింట్లను తమ గుపెట్లోకి తీసుకుంటున్నారీ నేరగాళ్లు. తద్వారా బయోమెట్రిక్ పరిశీలన కోసం సదరు డాక్యుమెంట్లలోని ఫింగర్ ప్రింట్లను వారు చోరీ చేస్తున్నారు. దీంతో ఆధార్ కార్డు నెంబర్, బయోమెట్రిక్ వివరాలు ఒకసారి చేతిలోకి వస్తే.. ఆ తర్వాత బ్యాంక్ నుంచి నగదు విత్ డ్రా చేయడం చాలా సులవు అయిపోతుంది. ఇదే సైబర్ నేరగాళ్లు చేస్తున్నారు.


దీని నుంచి ఎలా తప్పించుకోవచ్చు?

ఆధార్ కార్డును ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయవద్దు. ఓ వేళ ఆధార్ కార్డు షేర్ చేయాల్సి వస్తే మాత్రం.. ఆధార్ కార్డ్ నంబర్ కనిపించని చోట మీరు మాస్క్‌డ్ ఆధార్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. అలా కాకుంటే విరిట్యుల్ ఐడీని మాత్రం షేర్ చేసినా సరిపోతుంది. ఈ విరిట్యుల్ ఐడీ కార్డు పొందాలంటే.. UIDAI వెబ్‌సైట్‌లోకి వెళ్లి. మార్క్ ఆధార్ కార్డును పొందవచ్చు. అందుకోసం ఆధార్ కార్డు నెంబర్‌తోపాటు మొబైల్ నెంబర్‌ను సైతం వెబ్‌సైట్‌లో పొందుపరచ వలసి ఉంటుంది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 17 , 2024 | 03:32 PM

Advertising
Advertising
<