ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Amit Shah: సోనియాగాంధీ ఏకైక లక్ష్యం అదే... అమిత్‌షా విసుర్లు

ABN, Publish Date - Mar 09 , 2024 | 06:19 PM

కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్ సహా విపక్ష పార్టీలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మరోసారి విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడం సోనియాగాంధీ ఏకైక లక్ష్యమని, తేజస్వి యాదవ్‌ను బీహార్ ముఖ్యమంత్రిగా చేయడం లాలూ ప్రసాద్ యాదవ్ లక్ష్యమని అన్నారు.

పాట్నా: కాంగ్రెస్ (Congress), రాష్ట్రీయ జనతా దళ్ (RJD) సహా విపక్ష పార్టీలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) మరోసారి విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం సోనియాగాంధీ (Sonia Gandhi) ఏకైక లక్ష్యమని, తేజస్వి యాదవ్‌ను బీహార్ ముఖ్యమంత్రిగా చేయడం లాలూ ప్రసాద్ యాదవ్ లక్ష్యమని అన్నారు. శనివారంనాడిక్కడ బీజేపీ ఓసీసీ మోర్చా పబ్లిక్ మీటింగ్‌లో అమిత్‌షా తాజా వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజల భూములను ఆక్రమించిన నేతల భరతం పట్టేందుకు త్వరలోనే ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.


కైలాస్ మిశ్రా విగ్రహావిష్కరణ

దీనికి ముందు, పాట్నా సమీపంలో ఏర్పాటు చేసిన వెటరన్ లీడర్ కైలాష్ మిశ్రా మెమోరియల్‌ను అమిత్‌షా ప్రారంభించారు. జన్‌సంఘ్ సీనియర్ నేత అయిన మిశ్రా గతంలో కర్పూర్ ఠాకూర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. బీహార్ బీజేపీ తొలి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. రాజస్థాన్, గుజరాత్ గవర్నర్‌గా సేవలందించారు. మిశ్రా పేరుతో ఏర్పాటు చేసిన పార్కు, ఆయన విగ్రహాన్ని అమిత్‌షా ఆవిష్కరించారు. అగ్నికల్చరల్ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఏటీఏఆర్ఐ) డొనేట్ చేసిన 2 ఎకరాల స్థలంలో పార్క్‌ను అభివృద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో అమిత్‌షాతో పాటు గవర్నర్ రాజేంద్ర వి ఆర్లేకర్, ఉపముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 06:22 PM

Advertising
Advertising